సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, జార్ఖండ్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే వేదికగా అరుణాచాల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ తరపున కిషన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
అరుణాచాల్ బౌలర్లను ఉతికారేశాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే జార్ఖండ్ వికెట్ నష్టపోకుండా ఊదిపడేసింది.
అతడితో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(13) ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ బౌలర్లలో స్పిన్నర్ అనుకుల్ రాయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. రవి కుమార్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఎస్ఆర్‌హెచ్‌లోకి ఎంట్రీ..
కాగా ఇటీవలే జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్ భారీ ధర దక్కింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ వరకు అతడు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
కానీ ఈసారి అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు. కాగా దేశీవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో కిషాన్ సెంట్రాల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment