ముంబై వదిలేసింది.. క‌ట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే భారీ సెంచ‌రీ | Ishan Kishan Scores First Century Of IPL 2025 | Sakshi
Sakshi News home page

IPL 2025: ముంబై ఇండియ‌న్స్ వదిలేసింది.. క‌ట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే భారీ సెంచ‌రీ

Published Sun, Mar 23 2025 6:07 PM | Last Updated on Mon, Mar 24 2025 10:54 AM

Ishan Kishan Scores First Century Of IPL 2025

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో తొలి సెంచరీ నమోదైంది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్(Ishan Kishan) అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 

తన ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను ఈ జార్ఖండ్ డైన్‌మేట్ ఊచకోత కోశాడు. ట్రావిస్ హెడ్‌, నితీశ్‌, క్లాసెన్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం ఇషాన్ కేవలం 45 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవరాల్‌గా 47 బంతులు ఎదుర్కొన్న కిషన్‌.. 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా గత కొన్ని సీజన్లగా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కిషన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ.11.25 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఇక 

మ్యాచ్ విషయానికి వ‌స్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన  ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. కిష‌న్‌తో పాటు ట్రావిస్‌ హెడ్‌(67), క్లాసెన్‌(34), నితీశ్‌ కుమార్‌(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్‌ శర్మ ఒక్క వికెట్‌ సాధించారు. ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం.

చదవండి: IPL 2025: ట్రావిస్ హెడ్ ఊచ‌కోత‌.. ఎగిరి గంతేసిన కావ్య పాప! వీడియో వైర‌ల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement