ఒలింపిక్స్‌లో టి20 క్రికెట్‌ను చేర్చాలి
సచిన్, వార్న్ అభిప్రాయం
లండన్: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆదరణ పొందిన టి20 ఫార్మాట్‌ను ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో ప్రవేశపెడితే బాగుంటుందని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బౌలింగ్ గ్రేట్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డారు. 1900 గేమ్స్‌లో చివరిసారిగా క్రికెట్ ఆడారు. అయితే మరోసారి ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను ఆడించడంపై వచ్చే నెలలో ఐసీసీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మధ్య చర్చలు జరుగనున్నాయి. ‘నిజంగా ఇది గొప్ప ఆలోచన.
ఇందులో టి20 ఫార్మాట్ సరిగ్గా సరిపోతుంది. క్రికెట్ గురించి ఏమాత్రం తెలి యని వారికైనా లేక ఈ ఆట గురించి పరిచయం చేయాలనుకున్నా ఈ ఫార్మాట్ ఉత్తమం.
ముఖ్యంగా మూడు గంటల్లో మ్యాచ్ అయిపోతుంది’ అని 42 ఏళ్ల సచిన్ అభిప్రాయపడ్డారు. క్రికెట్‌ను ఒలింపిక్ గేమ్‌గా చూడడం తనకు చాలా ఇష్టమని వార్న్ అన్నారు. టి20 మ్యాచ్‌ను నిర్వహించడం తేలిక అని, తక్కువ సమయంలోనే అయిపోవడంతో రోజుకు రెండు, మూడు మ్యాచ్‌లను జరపొచ్చని వార్న్ తెలిపారు.
మళ్లీ బ్యాట్ పట్టిన మాస్టర్: ఆల్ స్టార్స్ టి20 సిరీస్ కోసం సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ముంబైలో మంగళవారం నెట్ ప్రాక్టీస్‌లో మాస్టర్