T-20 format
-
‘ఇంగ్లిష్’ క్రికెట్‌కు రెడీ!
ఇంగ్లండ్ గడ్డపై నాలుగేళ్ల తర్వాత కీలక టెస్టు సిరీస్‌కు ముందు టి20, వన్డేలలో సత్తా చాటి ఫామ్‌లోకి వచ్చేందుకు భారత్ సన్నద్ధమైంది. పర్యటనలో భాగంగా అసలు పరీక్షకు ముందు ఐర్లాండ్‌తో టి20ల్లో తలపడనుంది. 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్ బరిలోకి దిగుతున్న టీమిండియా తమ స్థాయికి తగినట్లుగా విజయంపై దృష్టి పెట్టగా... గతంలోనూ పలు సంచలనాలు నమోదు చేసిన ఐర్లాండ్ సొంతగడ్డపై మరోసారి అలాంటి ఆటతీరు కనబర్చాలని పట్టుదలగా ఉంది. డబ్లిన్: దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత భారత జట్టు తొలిసారి తమ పూర్తి స్థాయి జట్టుతో మరో అంతర్జాతీయ పోరుకు సిద్ధమైంది. ఐర్లాండ్‌తో రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడ తొలి మ్యాచ్ జరుగనుంది. జట్టు బలాబలాలు, ఫామ్ దృష్ట్యా చూస్తే భారత్ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఇటీవలే టెస్టు హోదా పొందిన ఐర్లాండ్‌కు టి20ల్లో కూడా మంచి రికార్డు ఉండటం, స్థానిక పరిస్థితుల అనుకూలత కారణంగా మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. తుది జట్టులో ఎవరు? భారత జట్టు తమ ఆఖరి టి20 అంతర్జాతీయ మ్యాచ్ గత మార్చిలో నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఆడింది. అయితే ఆ టోర్నీ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి, ధోని, భువనేశ్వర్, బుమ్రా ఇప్పుడు తిరిగొచ్చారు. ఈ నలుగురు కూడా తుది జట్టులో ఖాయం. అయితే తాజా ఫామ్ ప్రకారం చూస్తే ధోని వచ్చినా దినేశ్ కార్తీక్‌కు బ్యాట్స్‌మన్‌గా స్థానం దక్కవచ్చు. లోకేశ్ రాహుల్ కూడా టీమ్‌లో ఉండే అవకా శం ఉంది. కాబట్టి మనీశ్ పాండేకు చోటు కష్టం. టి20ల్లో అద్భుత రికార్డు ఉన్నా... తాజా కూర్పులో రైనాకు కూడా స్థానం అనుమానంగా ఉంది. హార్దిక్ పాండ్యాతో కూడిన బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో ఇక్కడ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు చహల్, కుల్దీప్లను కోహ్లి కచ్చితంగా తుది జట్టులో ఎంచుకోవచ్చు. ఇద్దరు పేసర్ల స్థానాల్లో భువీ, బుమ్రాలు తప్పనిసరి. అయితే ఇటీవల మంచి ఫామ్‌లో ఉండి పునరాగమనం చేసిన ఉమేశ్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటే వీరిద్దరిలో ఒకరికి విశ్రాంతి తప్పదు. సిద్ధార్థ్ కౌల్ అవకాశం కోసం కొంత కాలం వేచి చూడక తప్పదు. సీనియర్లదే భారం... ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా పది రోజుల క్రితమే స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌లతో ఆడిన ఐర్లాండ్ మంచి మ్యాచ్ ప్రాక్టీస్‌లో ఉంది. ఈ టోర్నమెంట్లో ఫైనల్ చేరిన ఐర్లాండ్ అదే జట్టును ఇక్కడా కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా కెప్టెన్ గ్యారీ విల్సన్, వెటరన్లు పోర్టర్ ఫీల్డ్, కెవిన్ ఓబ్రైన్లపై ఆ జట్టు ఆధారపడుతోంది. ఓపెనర్ స్టిర్లింగ్‌కు కూడా దూకుడుగా ఆడగల సత్తా ఉంది. బౌలింగ్‌లో డాక్రెల్, థాంప్సన్ కీలకం. భారత్‌లో పుట్టి ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్ స్పిన్నర్ సిమి సింగ్ తొలిసారి తన సొంత దేశానికి ప్రత్యర్థిగా ఆడనుం డటం విశేషం. టి20ల్లో ఒక మ్యాచ్ లో విండీస్‌పై మినహా మిగతా అన్ని విజయాలు చిన్న జట్లపైనే సాధించిన ఐర్లాండ్ పటిష్ట టీమిండియాకు ఎంతవరకు పోటీనిస్తుందనేది ఆసక్తికరం. ఆహ్లాదకర వాతావరణంలో... ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన తర్వాత భారత జట్టు సోమవారం తొలిసారి ప్రాక్టీస్‌లో పాల్గొంది. లండన్ మహానగర శివార్లలో ఉన్న మర్చంట్ టేలర్స్ స్కూల్‌ను అందుకు వేదికగా ఎంచుకుంది. ఇంగ్లండ్‌లో అందుబాటులో ఉన్న ప్రధాన వేదికల్లోని శిక్షణా సౌకర్యాలకు దూరంగా కాస్త ప్రశాంతంగా సాధన చేసేందుకు కోహ్లి సేన ఇక్కడకు వచ్చింది. 800కు పైగా విద్యార్థులు ఉన్న ఈ స్కూల్లో ఎక్కువ మంది భారత ఉపఖండం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. 285 ఎకరాల విస్తీర్ణంలో అందమైన పచ్చిక బయళ్లు, రెండు వైపుల సరస్సులతో అద్భుతంగా ఉన్న ఈ స్కూల్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడాన్ని ఆటగాళ్లు అమితంగా ఆస్వాదించారు. గతంలో ఈ స్కూల్లో కోచింగ్ ఇచ్చిన దిగ్గజ బ్యాట్స్‌మన్ గార్డన్ గ్రీనిడ్జ్ అక్కడే ఉండే భారత ఆటగాళ్లతో ముచ్చ టించాడు. సెలవులు గడిపేందుకు తన కొడుకుతో కలిసి వచ్చిన మాజీ పేసర్ నెహ్రా కూడా టీమిండియా బౌలర్లకు ప్రాక్టీస్‌లో సూచనలిచ్చాడు. ►100 భారత్‌కు ఇది 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్. ఇప్పటివరకు 62 మ్యాచ్‌లు గెలిచి, 35 ఓడింది. 2 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, కార్తీక్, పాండ్యా, ధోని, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా/ఉమేశ్. ఐర్లాండ్: విల్సన్ (కెప్టెన్), స్టిర్లింగ్, షెనాన్, బల్బిర్నీ, సిమిసింగ్, కెవిన్ ఓబ్రైన్, థాంప్సన్, పాయింటర్, డాక్రెల్, మెకార్తీ, ఛేజ్. -
2024 ఒలింపిక్స్‌లో క్రికెట్!
బిడ్ కోసం ఐసీసీ ప్రయత్నం లండన్: టి20 ఫార్మాట్లో 2024 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈమేరకు బిడ్ వేస్తామని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ తెలిపారు. మెజారిటీ సభ్యులు కూడా దీనికి మద్దతుగా ఉన్నారని, త్వరలో జరిగే సమావేశంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి దరఖాస్తు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘క్రికెట్‌కు విశ్వవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు ఇది సరైన అవకాశంగా ఐసీసీ సభ్యులు భావిస్తున్నారు. జూలై వరకు ఈ విషయంలో మేం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే 2024 గేమ్స్‌లో కొత్త క్రీడలకు చోటు కల్పించేందుకు సెప్టెంబర్‌లో ఐఓసీకి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్స్‌లో టి20 ఫార్మాట్ సరిగ్గా సరిపోతుంది’ అని రిచర్డ్సన్ తెలిపారు. చివరిసారి 1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడించారు. ఆ ఈవెంట్లో బ్రిటన్, ఫ్రాన్స్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. -
భారత్ వైట్‌వాష్...
వెస్టిండీస్‌దే టి20 సిరీస్ మూడో మ్యాచ్‌లోనూ విజయం విజయవాడ స్పోర్ట్స: వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత మహిళల జట్టు అదే ప్రదర్శనను టి20 ఫార్మాట్లో పునరావృతం చేయడంలో విఫలమైంది. మూడో టి20 మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూసిన టీమిండియా సిరీస్‌ను 0-3తో కోల్పోరుుంది. టి20 వరల్డ్ చాంపియన్ వెస్టిండీస్ తమ హోదాకు తగ్గట్టు రాణించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి వన్డే సిరీస్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మూలపాడు స్టేడియంలో మంగళవారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో భారత జట్టు 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 139 పరుగులు సాధించింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (22 బంతుల్లో 47; 7 ఫోర్లు, ఒక సిక్సర్), స్టెఫానీ టేలర్ (55 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 6.4 ఓవర్లలో 61 పరుగులు జోడించి విండీస్‌కు శుభారంభం అందించారు.. హేలీ అవుటయ్యాక విండీస్ స్కోరు బోర్డు నెమ్మదించింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా... జులన్ గోస్వామి, ఏక్తా బిష్త్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 124 పరుగులు సాధించి ఓటమి పాలైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వేద కృష్ణమూర్తి (40 బంతుల్లో 31 నాటౌట్) నాలుగో వికెట్‌కు అజేయంగా 92 పరుగులు జోడించినా భారత్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయారు. -
ఒలింపిక్స్‌లో టి20 క్రికెట్‌ను చేర్చాలి
సచిన్, వార్న్ అభిప్రాయం లండన్: ప్రపంచ క్రికెట్లో అత్యంత ఆదరణ పొందిన టి20 ఫార్మాట్‌ను ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో ప్రవేశపెడితే బాగుంటుందని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బౌలింగ్ గ్రేట్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డారు. 1900 గేమ్స్‌లో చివరిసారిగా క్రికెట్ ఆడారు. అయితే మరోసారి ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను ఆడించడంపై వచ్చే నెలలో ఐసీసీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మధ్య చర్చలు జరుగనున్నాయి. ‘నిజంగా ఇది గొప్ప ఆలోచన. ఇందులో టి20 ఫార్మాట్ సరిగ్గా సరిపోతుంది. క్రికెట్ గురించి ఏమాత్రం తెలి యని వారికైనా లేక ఈ ఆట గురించి పరిచయం చేయాలనుకున్నా ఈ ఫార్మాట్ ఉత్తమం. ముఖ్యంగా మూడు గంటల్లో మ్యాచ్ అయిపోతుంది’ అని 42 ఏళ్ల సచిన్ అభిప్రాయపడ్డారు. క్రికెట్‌ను ఒలింపిక్ గేమ్‌గా చూడడం తనకు చాలా ఇష్టమని వార్న్ అన్నారు. టి20 మ్యాచ్‌ను నిర్వహించడం తేలిక అని, తక్కువ సమయంలోనే అయిపోవడంతో రోజుకు రెండు, మూడు మ్యాచ్‌లను జరపొచ్చని వార్న్ తెలిపారు. మళ్లీ బ్యాట్ పట్టిన మాస్టర్: ఆల్ స్టార్స్ టి20 సిరీస్ కోసం సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ముంబైలో మంగళవారం నెట్ ప్రాక్టీస్‌లో మాస్టర్ -
వీళ్లతో గెలుస్తామా..?
అశ్విన్ మినహా బౌలర్లంతా పేలవం టి20 ప్రపంచ కప్ ముంగిట ఇబ్బంది ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో భారత్ ఒక్క బౌలర్‌తోనే ఆడుతోంది..! అతిశయోక్తిలా అనిపించినా వాస్తవం ఇలాగే ఉంది. ఒక్క అశ్విన్‌ను మినహాయిస్తే మిగిలిన నలుగురు బౌలర్లూ దారుణంగా తేలిపోయారు. వీళ్లకంటే స్కూల్ పిల్లలు నయమనే తరహాలో బౌలింగ్ చేస్తూ... టి20 ఫార్మాట్లో మన బౌలింగ్ స్థాయి ఎక్కడుందో చూపించారు. ఆరు నెలల్లో స్వదేశంలోనే టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ బౌలింగ్ లైనప్‌తో ఎలా గెలుస్తారనేదే ప్రశ్న. సాక్షి క్రీడా విభాగం కటక్‌లో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో 20 ఏళ్ల దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కాగిసో రబడ 140 కిలో మీటర్ల వేగంతో బంతులు వేస్తూ... అడపా దడపా 150 కి.మీ.ని దాటి బంతులు విసిరాడు. ఇక బౌన్స్ ఉన్న ధర్మశాలలో అయితే అతని బంతులను అందుకునేందుకు కీపర్ డివిలి యర్స్ చాలా సార్లు ఆకాశాన్ని అందుకోవాలా అన్నట్లుగా ఎగరాల్సి వచ్చింది. పలు సార్లు చక్కటి బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన రబడ అంపైర్ హెచ్చరికకు కూడా గురయ్యాడు. అదే మన పేసర్లు భువనేశ్వర్, మోహిత్, అరవింద్ కలిసి ఒక్కటంటే ఒక్క బౌన్సర్ కూడా వేసింది లేదు! ఆశ్చర్యమే అనిపిస్తున్నా మనోళ్ల పేస్ అంటే నేతి బీరకాయలో నేయి చందమే. కచ్చితంగా వికెట్ దక్కాల్సిన అవసరం లేదు కానీ.... 120 బంతుల ఇన్నింగ్స్‌లో ఇలాంటి పరుగు రాని బంతుల విలువ ఎక్కువే ఉంటుంది. పైగా బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలో నెట్టేందుకు ఇవి చాలు. స్టార్ బౌలర్లు స్టెయిన్, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్ లేకుండా దక్షిణాఫ్రికా ద్వితీయ శ్రేణి పేసర్లు కూడా ప్రభావం చూపిస్తున్న చోట మనోళ్లు తేలిపోతున్నారు. ఉమేశ్ పనికి రాడా..?‘మా ఫాస్ట్ బౌలర్లపై విశ్వాసం కోల్పోలేదు. సిరీస్ జరుగుతున్న పిచ్‌లను బట్టి జట్టును ఎంపిక చేశాం. ఇషాంత్ పేరు కూడా చర్చించాం. అతడు టెస్టులకే పరిమితం కాదు’... టి20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన అనంతరం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ వ్యాఖ్య ఇది. అయితే ఈ లాజిక్‌లో అర్థం లేకపోవడంతో పాటు గందరగోళం కూడా కనిపిస్తోంది. సాధారణంగా అందుబాటులో ఉన్న (ఫిట్నెస్ సమస్యలు లేకుండా) అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలనేది ప్రాథమిక సూత్రం. అయితే ఈ సిరీస్‌లో ఉన్న భువీ, మోహిత్, అరవింద్ ఒకే తరహాలో బౌలింగ్ చేసే సాధారణ మీడియం పేసర్లు. ఎక్కువగా స్వింగ్‌పై ఆధారపడేవారే. తమ వేగంతో ఫలితం రాబట్టగల సామర్థ్యం వీరిలో లేదు. అలాంటప్పుడు ఒక ఫుల్‌లెంగ్త్ ఫాస్ట్ బౌలర్ జట్టులో ఉండాలి. ఉమేశ్ చాలా కాలంగా జట్టులో రెగ్యులర్ సభ్యుడు. వరల్డ్ కప్‌లో చాలా బాగా రాణించాడు. దీనికి ముందు శ్రీలంక సిరీస్‌లోనూ జట్టులో ఉన్నాడు. టి20 స్పెషలిస్ట్‌లు అని పేరు లేకపోయినా... ఇషాంత్, ఆరోన్ తమ వేగంతో బౌలింగ్‌కు వైవిధ్యం తీసుకు రాగలరు. వీరిని ఎందుకు పక్కన పెట్టారో కూడా కనీస కారణం సెలక్టర్లు చెప్పలేకపోయారు. స్పిన్నర్లు ఎక్కడ? మన దేశంలో నాణ్యమైన స్పిన్నర్లు లేరు అంటూ అధ్యక్షుడిగా వచ్చీ రాగానే శశాంక్ మనోహర్ వ్యాఖ్యానించడం ఒక రకంగా అవమానకర విషయం. జడేజాకు ప్రత్యామ్నాయం అంటూ తీసుకొచ్చిన అక్షర్ పటేల్ సాధారణంగా కనిపిస్తున్నాడు. ‘స్పిన్‌లో వైవిధ్యం చూపించని అక్షర్ అతి సాధారణ బౌలర్. సులువుగా అతడి బంతులను బ్యాట్స్‌మెన్ అంచనా వేయవచ్చు. అంతర్జాతీయ బౌలర్‌గా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని గవాస్కర్ విమర్శించడం పరిస్థితిని సూచిస్తోంది. బహుశా దీని వల్లే డుమిని తొలి టి20లో వరుసగా మూడు సిక్సర్లతో చెలరేగి మ్యాచ్ దిశను మార్చాడు. సోమవారం మ్యాచ్‌లో అక్షర్‌ను పక్కన పెట్టి రైనాతో పూర్తి కోటా వేయించడం చూస్తే రెగ్యులర్ స్పిన్నర్ల స్థితి అర్థమవుతుంది. గత రెండేళ్లుగా అశ్విన్ ఎంతో ఎదిగిపోగా... రెండో స్పిన్నర్‌గా ఎవరూ ప్రభావం చూపడం లేదు. కెరీర్ చివర్లో ఉన్న హర్భజన్ వరల్డ్ కప్ వరకు జట్టులో ఉంటాడో లేదో కూడా తెలీదు. మిశ్రా, కరణ్ శర్మలకు పూర్తి స్థాయి అవకాశాలే రాలేదు. పరీక్ష ఎప్పటి వరకు ప్రపంచకప్‌లోగా టి20 మ్యాచ్‌ల్లో ఫలితాలకంటే అన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలించడం, అందరికీ అవకాశం ఇవ్వడం ముఖ్యమని కెప్టెన్ ధోని చెబుతున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత భారత్ ఆస్ట్రేలియా వెళ్లి 5 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు కూడా ఆడుతుంది. అక్కడ టి20లు ఆడటం భారత్‌లో జరిగే ప్రపంచకప్‌కు పెద్దగా పనికి రాకపోవచ్చు. కానీ ఐపీఎల్లో తమ ఫ్రాంచైజీల తరఫున చెలరేగే బౌలర్లు... అంతర్జాతీయ మ్యాచ్‌లో మాత్రం తేలిపోతున్నారు. మోహిత్, భువీ, అక్షర్... ఎవరైనా అంతే. పరిస్థితి చూస్తే అరవింద్ కెరీర్ ఒక్క మ్యాచ్‌కే ముగిసిపోతుందేమోఅనిపిస్తుంది. అలాంటప్పుడు వరల్డ్ కప్‌లోగా ఎంత మందిని పరీక్షిస్తారు, చివరకు ఎలాంటి జట్టుతో సిద్ధమవుతారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న బృందంతో మాత్రం భారత్ మ్యాచ్‌లు గెలవడం చాలా కష్టం.