భారత్ వైట్‌వాష్...
వెస్టిండీస్‌దే టి20 సిరీస్
మూడో మ్యాచ్‌లోనూ విజయం
విజయవాడ స్పోర్‌ట్స: వన్డే ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత మహిళల జట్టు అదే ప్రదర్శనను టి20 ఫార్మాట్‌లో పునరావృతం చేయడంలో విఫలమైంది. మూడో టి20 మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూసిన టీమిండియా సిరీస్‌ను 0-3తో కోల్పోరుుంది. టి20 వరల్డ్ చాంపియన్ వెస్టిండీస్ తమ హోదాకు తగ్గట్టు రాణించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి వన్డే సిరీస్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మూలపాడు స్టేడియంలో మంగళవారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో భారత జట్టు 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 139 పరుగులు సాధించింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (22 బంతుల్లో 47; 7 ఫోర్లు, ఒక సిక్సర్), స్టెఫానీ టేలర్ (55 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 6.4 ఓవర్లలో 61 పరుగులు జోడించి విండీస్‌కు శుభారంభం అందించారు.. హేలీ అవుటయ్యాక విండీస్ స్కోరు బోర్డు నెమ్మదించింది.
భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా... జులన్ గోస్వామి, ఏక్తా బిష్త్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 124 పరుగులు సాధించి ఓటమి పాలైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వేద కృష్ణమూర్తి (40 బంతుల్లో 31 నాటౌట్) నాలుగో వికెట్‌కు అజేయంగా 92 పరుగులు జోడించినా భారత్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయారు.