2024 ఒలింపిక్స్‌లో క్రికెట్!
బిడ్ కోసం ఐసీసీ ప్రయత్నం
లండన్: టి20 ఫార్మాట్‌లో 2024 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈమేరకు బిడ్ వేస్తామని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ తెలిపారు. మెజారిటీ సభ్యులు కూడా దీనికి మద్దతుగా ఉన్నారని, త్వరలో జరిగే సమావేశంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి దరఖాస్తు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘క్రికెట్‌కు విశ్వవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు ఇది సరైన అవకాశంగా ఐసీసీ సభ్యులు భావిస్తున్నారు.
జూలై వరకు ఈ విషయంలో మేం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే 2024 గేమ్స్‌లో కొత్త క్రీడలకు చోటు కల్పించేందుకు సెప్టెంబర్‌లో ఐఓసీకి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్స్‌లో టి20 ఫార్మాట్ సరిగ్గా సరిపోతుంది’ అని రిచర్డ్‌సన్ తెలిపారు. చివరిసారి 1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడించారు. ఆ ఈవెంట్‌లో బ్రిటన్, ఫ్రాన్స్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి.