ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు పలు ఆసక్తికర ప్రతిపాదనలు చేసింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెండో టెస్టుకు ముందు వరల్డ్ క్రికెట్ కమిటీ రెండు రోజులు సమావేశమైంది. ఈ సమావేశంలో టెస్టు క్రికెట్ సహా మహిళల క్రికెట్ అభివృద్ధిని ప్రోత్సహించడంపై చర్చించింది. దీంతో పాటు ద్వైపాక్షిక వన్డే సిరీస్ మ్యాచ్‌లను గణనీయంగా తగ్గించాలంటూ ఐసీసీకి ప్రతిపాదన పంపింది.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ గాటింగ్ ఆధ్వర్యంలో లార్డ్స్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలోకమిటీ మెంబర్లు సౌరవ్ గంగూలీ, ఝులన్ గోస్వామి, జస్టిన్ లాంగర్, ఇయాన్ మోర్గాన్, కుమార సంగక్కర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్(FTP)పై ఐసీసీకి పలు సిఫార్సులు చేసింది.
2027 తర్వాత పురుషుల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP)లో ఆతిథ్య, టూర్లకు వచ్చే పూర్తి సభ్య దేశాలన్నింటికీ మ్యాచ్‌ల సమాన షెడ్యూల్‌ని నిర్ధారించాలని ఐసీసీని కోరింది. భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ పూర్తయిన తర్వాత వన్డే మ్యాచ్‌లను గణనీయంగా తగ్గించాలని సూచించింది. ప్రతి ప్రపంచకప్‌కు ముందు ఒక సంవత్సరం వ్యవధి మినహా ద్వైపాక్షిక మ్యాచ్‌లను పరిమితం చేయడం ద్వారా వన్డే క్రికెట్ నాణ్యతను పెంచడం దీని లక్ష్యం.
"ఈ కారణంగా ప్రపంచ క్రికెట్ క్యాలెండర్‌లో మనకు కావాల్సిన స్పేస్ దొరుకుతుంది. " అని WCC తెలిపింది. ఇటీవలే ప్రపంచ క్రికెట్ పాలక మండలి(WCC) రాబోయే సంవత్సరాల్లో జరిగే అన్ని గ్లోబల్ ఈవెంట్‌ల కోసం వారి మీడియా హక్కులను రికార్డ్ స్థాయిలో విక్రయించింది.
The MCC World Cricket committee has proposed strategic funds for Test cricket and the women’s game to drive transformative change for the global game.
— Marylebone Cricket Club (@MCCOfficial) July 11, 2023
More information ⤵️#CricketTwitter
చదవండి: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్‌కు గ్రీన్ సిగ్నల్
Duleep Trophy 2023: ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా
Comments
Please login to add a commentAdd a comment