అరుదైన రికార్డ్‌కు అడుగు దూరంలో ఉన్న టీమిండియా | Team India One Win Away From Rare Record In Test Cricket | Sakshi
Sakshi News home page

అరుదైన రికార్డ్‌కు అడుగు దూరంలో ఉన్న టీమిండియా

Published Sun, Sep 15 2024 6:40 PM | Last Updated on Sun, Sep 15 2024 6:40 PM

Team India One Win Away From Rare Record In Test Cricket

టెస్ట్‌ క్రికెట్‌లో టీమిండియా ఓ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉంది. సెప్టెంబర్‌ 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ ఓ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంటుంది. టెస్ట్‌ల్లో ఇప్పటి వరకు కేవలం నాలుగు జట్లు మాత్రమే పరాజయాల కంటే ఎక్కువ విజయాలు సాధించాయి. బంగ్లాతో మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే ఈ రికార్డు సాధించిన ఐదో జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుతుంది. భారత్‌ ఇప్పటివరకు 579 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి 178 విజయాలు, 178 పరాజయాలను ఎదుర్కొంది. మిగతా 223 మ్యాచ్‌ల్లో 222 డ్రా కాగా.. ఓ మ్యాచ్‌ టైగా ముగిసింది.  

బంగ్లాపై తొలి టెస్ట్‌లో గెలిస్తే భారత్‌ విజయాల సంఖ్య పరాజయాల సంఖ్య కంటే ఎక్కువుతుంది. చరిత్రలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌ మాత్రమే పరాజయాల కంటే ఎక్కువ విజయాలు సాధించాయి. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 866 టెస్ట్‌లు ఆడి 414 విజయాలు, 232 పరాజయాలు ఎదుర్కొంది. ఇంగ్లండ్‌ ఇప్పటివరకు 1077 మ్యాచ్‌లు ఆడి.. 397 విజయాలు, 325 పరాజయాలు ఎదుర్కొంది. దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 466 టెస్ట్‌లు ఆడి 179 విజయాలు, 161 పరాజయాలు ఎదుర్కొంది. పాకిస్తాన్ ఇప్పటివరకు 458 టెస్ట్‌లు ఆడి 148 విజయాలు, 144 పరాజయాలు ఎదుర్కొంది.

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. భారత ఆటగాళ్లంతా చెన్నైలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో జోరుగా   ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

తొలి టెస్ట్‌కు భారత జట్టు..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, సర్ఫరాజ్‌ ఖాన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, ధృవ్‌ జురెల్‌, రిషబ్‌ పంత్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఆకాశ్‌దీప్‌, యశ్‌ దయాల్‌, జస్ప్రీత్‌ బుమ్రా

చదవండి: జోరుగా సాగుతున్న టీమిండియా ప్రాక్టీస్‌.. వీడియో
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement