వెస్టిండీస్‌తో వచ్చే నెలలో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాను ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న పుజారా ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 41 పరుగులు మాత్రమే చేసి విఫలమైన పుజారాపై వేటు పడింది. 35 ఏళ్ల వయసున్న పుజారా కెరీర్‌కు ముగింపు పడినట్లే అని సోషల్ మీడియాలో హోరెత్తింది.
అయితే పుజారాను తప్పించడంపై భారత్ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తప్పుబట్టాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే మినహా మిగతా బ్యాటర్లు ఏం వెలగబెట్టారని.. వారిని కూడా తప్పించాల్సింది పోయి కేవలం పుజారాను బలిపశువును చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు కూడా పుజారాకు మద్దతుగా నిలుస్తూ.. ''అతని ఆట ముగిసిపోలేదు.. మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది.. మరో రెండేళ్లు అతనిలో క్రికెట్ ఆడే సత్తా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చారు.
అయితే విండీస్ టూర్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై పుజారా పెద్దగా స్పందించలేదు. కానీ శనివారం సాయంత్రం ట్విటర్ వేదికగా ఒక వీడియోనూ షేర్ చేస్తూ బ్యాట్, బంతితో పాటు లవ్ ఎమోజీ పెట్టాడు. తన ఆట అయిపోలేదని.. మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తానంటూ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ఎమోషనల్ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పాడు. పుజారా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🏏 ❤️ pic.twitter.com/TubsOu3Fah
— Cheteshwar Pujara (@cheteshwar1) June 24, 2023
Best of luck for comeback🤞
— Shubman Gang (@ShubmanGang) June 24, 2023
Not finished 👍
— Naveen (@_naveenish) June 24, 2023
Comeback stronger like Rahane and ignore all comments including mine
— Mr Wrong / Cr7 & Abd ❤️ (@wrong_huihui) June 24, 2023
Comments
Please login to add a commentAdd a comment