క్రికెట్ వ్యాప్తికి చొరవ చూపడంతో పాటు గతేడాది (2023) అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఐసీసీ అసోసియేట్ సభ్య దేశాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ "డెవలెప్‌మెంట్ అవార్డులతో" సత్కరించింది. ఈ అవార్డులను వివిధ విభాగాల్లో మెక్సికో, ఒమన్, నెదర్లాండ్స్, యూఏఈ, నేపాల్, స్కాట్లాండ్ దేశాలు గెలుచుకున్నాయి. ఈ అవార్డుల కోసం మొత్తం 21 జట్లు షార్ట్ లిస్ట్ కాగా.. ఐసీసీ ప్యానెల్ పైన పేర్కొన్న జట్లను ఎంపిక చేసింది.
వంద శాతం మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించినందుకు గాను ఒమన్..
పురుషుల క్రికెట్‌లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో పాటు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించినందుకు గాను నెదర్లాండ్స్..
మహిళల క్రికెట్‌లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను యూఏఈ..
డిజిటల్ మీడియాలో అభిమానులను ఎంగేజ్ చేయడంలో సఫలీకృతమైనందుకు గాను నేపాల్..
క్రికెట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు గాను స్కాట్లాండ్..
జైలులో ఖైదీల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించినందుకు గాను మెక్సికో దేశాలు ఐసీసీ డెవలప్‌మెంట్ అవార్డులకు ఎంపికయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment