లక్ష్మణ్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం | Laxman is the honorary member of the MCC | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం

Published Fri, May 12 2017 1:39 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

లక్ష్మణ్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం

లక్ష్మణ్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం

హైదరాబాద్‌: భారత సొగసరి మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) వీవీఎస్‌కు జీవితకాల గౌరవ సభ్యత్వాన్ని అందజేసింది. ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌ లక్ష్మణ్‌ కాగా ఇంతకుముందే సచిన్, ద్రవిడ్, గంగూలీ, జహీర్‌ ఖాన్‌లు ఎంసీసీలో సభ్యులుగా ఉన్నారు.

‘ప్రఖ్యాతిగాంచిన క్రికెట్‌ క్లబ్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం’ అని వీవీఎస్‌ ఆనందం వ్యక్తం చేశారు. 16 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన లక్ష్మణ్‌ 134 టెస్టులు, 86 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 45.97 సగటుతో 8,781 పరుగులు... వన్డేల్లో 30.76 సగటుతో 2,338 పరుగులు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement