లండన్: క్రికెట్‌లో లింగభేదానికి తావు లేకుండా మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పురుష క్రికెటర్లను మాత్రమే సంబోధించే బ్యాట్స్‌మన్ అన్న పదాన్ని తొలగించి మహిళలు, పురుషులకు కామన్‌గా వర్తించేలా బ్యాటర్ అన్న పదాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని బుధవారం ప్రకటించింది. గత కొంత కాలంగా ఈ ప్రతిపాదన ఎంసీసీ పరిశీలనలో ఉండగా.. తాజాగా ఆమోదించబడింది.
లింగభేదం లేని పదాన్ని ఉపయోగించడం వల్ల క్రికెట్ అందరి క్రీడ అని మరోసారి నిరూపించబడుతుందని ఎంసీసీ విశ్వసిస్తోంది. లింగభేదం లేని పదాలు వాడటం వల్ల మరింత మంది మహిళలు క్రికెట్ పట్ల ఆకర్షితులవుతారని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే, క్రికెట్‌కు సంబంధించి లింగభేదానికి ఆస్కారముండే థర్డ్ మ్యాన్, నైట్ వాచ్‌మన్, జెంటిల్మెన్ వంటి పదాలపై ఎంసీసీ ఎలాంటి కామెంట్లు చేయకపోవడం విశేషం.
చదవండి: కెప్టెన్సీ విషయంలో వారిద్దరికీ పట్టిన గతే కోహ్లికి కూడా పట్టవచ్చు..!
Comments
Please login to add a commentAdd a comment