cricket rules
-
ఇకపై క్రికెట్లో కొత్త రూల్.. అతిక్రమిస్తే తప్పదు భారీ మూల్యం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ ఏడాది డిసెంబర్ నుంచి పురుషుల వన్డే, టీ20 క్రికెట్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. "స్టాప్ క్లాక్" పేరుతో ఉండే ఈ నిబంధనను వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ వెల్లడించింది. స్టాప్ క్లాక్ నిబంధన ఏంటంటే.. ఐసీసీ కొత్తగా ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకెన్ల నిర్దిష్ట సమయాన్ని గ్యాప్ టైమ్‌గా ఫిక్స్ చేసింది. బౌలింగ్ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్ వేసేందుకు బౌలర్‌ను దించాలి. రెండుసార్లు నిర్దిష్ట వ్యవధి దాటితే మన్నిస్తారు. మూడోసారి ఆలస్యమైతే మాత్రం బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ టీమ్ స్కోర్‌కు యాడ్ అవుతాయి. ఫీల్డ్ అంపైర్లు స్టాప్ క్లాక్‌తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. అహ్మదాబాద్‌లో నిన్న (నవంబర్ 21) జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై నిర్ణయం తీసుకున్నారు. -
కొత్త రూల్ ప్రవేశపెట్టనున్న బీసీసీఐ.. ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చేయవచ్చు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దేశవాళీ క్రికెట్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెలలో (అక్టోబర్) ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ నుంచి 'ఇంపాక్ట్ ప్లేయర్' అనే నయా రూల్‌ను అమల్లోకి తేనుంది. ఈ రూల్ అమల్లోకి వస్తే ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చుకునే వెసలుబాటు లభిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం.. ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాక 14 ఓవర్ల లోపు ఇరు జట్లు ఒక్కో ఆటగాడిని మార్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా మ్యాచ్ మధ్యలో ఆటగాడికి గాయమైనా లేక ఆనారోగ్యం బారిన పడినా అతని స్థానంలో మరో ఆటగాడు (సబ్‌స్టిట్యూట్) బరిలోకి దిగుతాడు. ఇక్కడ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం అయితే బౌలింగ్ చేసే జట్టులో ఇన్నింగ్స్ 14 ఓవర్లలోపు ఆటగాడు గాయపడినా లేదా మ్యాచ్ అప్పటి స్థితిగతులను బట్టి ఓ ఆటగాడిని మార్చుకోవాలని భావించినా ఓవర్ ముగిశాక కెప్టెన్ లేదా హెడ్ కోచ్ లేదా మేనేజర్లలో ఎవరో ఒకరు ఫీల్డ్ అంపైర్ లేదా ఫోర్త్ అంపైర్‌కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్‌తో పాటు 4 ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయవచ్చు. అదే బ్యాటింగ్ చేసే జట్టు వికెట్ పడ్డాక ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ గురించి అంపైర్‌కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే వెసలుబాటు ఉంటుంది. ఇందుకోసం ఇరు జట్లు టాస్ సమయంలో ప్లేయింగ్ ఎలెవెన్‌తో పాటు నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. తప్పనిసరి కాని ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ప్రకారం ఒక్కసారి జట్టును వీడిన ఆటగాడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం (ఆ మ్యాచ్ వరకు) ఉండదు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో మాత్రమే అమల్లో ఉన్న ఈ రూల్ త్వరలో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ అమల్లోకి రానుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్లో సైతం ప్రవేశ పెట్టాలని బీసీసీఐ యోచిస్తుంది. క్రికెట్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఫుట్‌బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో కూడా అమల్లో ఉంది. ఈ రూల్ అమల్లోకి వస్తే క్రికెట్ మరింత రసవత్తరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
బౌలర్ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్ అంపైర్‌కు హక్కు ఉంటుందా?
టి20 బ్లాస్ట్‌లో భాగంగా డెర్బీషైర్, వార్విక్ షైర్ మధ్య మ్యాచ్‌లో కార్లోస్ బ్రాత్‌వైట్ చేసిన తప్పుకు ఫీల్డ్ అంపైర్ బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించడం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ జట్టు తప్పు చేస్తే పీల్డ్ అంపైర్‌కు వెంటనే యాక్షన్ తీసుకునే హక్కు ఉంటుందా అని చాలా మందికి డౌట్ వచ్చింది. అయితే క్రికెట్ పుస్తకాలు మాత్రం అంపైర్‌కు ఆ హక్కు ఉంటుందని పేర్కొంటున్నాయి. క్రికెట్ పుస్తకాల్లోని లా 41.5 నిబంధనలు ఇదే విషయాన్ని పేర్కొంటున్నాయి. ఒక బౌలర్ ఉద్దేశపూర్వకంగా బ్యాటర్‌ను గాయపరిస్తే అతనితో పాటు జట్టుపై ఫీల్డ్ అంపైర్ ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చనేది పరిశీలిద్దాం లా 41.5.1: ఈ నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టులోని ఒక ఫీల్డర్.. బ్యాటర్ బంతి ఆడడానికి ముందు లేదా ఆడిన తర్వాత .. ఉద్దేశపూర్వకంగా తిట్టినా, దృష్టి మరల్చినా, అడ్డుకున్నా అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది. లా 41.5.2: ఈ ఘటనపై ఫీల్డ్ అంపైర్ లేదా లెగ్ అంపైర్‌లో ఎవరో ఒకరు.. పీల్డర్ చేసింది ఉద్దేశపూర్వకమేనా లేక అనుకోకుండా జరిగిందా అన్నది పరిశీలించాలి లా 41.5.3: ఒకవేళ ఫీల్డర్ లేదా బౌలర్ తప్పు ఉందని తేలితే.. మైదానంలో ఉన్న ఇద్దరు అంపైర్లలో ఒకరు వెంటనే బౌలింగ్ జట్టుకు వార్నింగ్ ఇస్తూ డెడ్ బాల్‌గా పరిగణించాలి. ఇదే సమయంలో మరో అంపైర్‌కు బంతిని రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలి లా 41.5.4: ఇలాంటి బంతులను డెడ్‌బాల్‌గా పరిగణించి.. బ్యాటర్‌ను నాటౌట్‌గా పరిగణిస్తారు. లా 45.5.5: ఫీల్డర్ లేదా బౌలర్.. బ్యాటర్లతో ఫిజికల్‌గా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని పరిశీలించాలి. ఒకవేళ ఫిజికల్ అని తేలితే.. లా 42 ప్రకారం(ఆటగాడి నిబంధన ఉల్లంఘన) ప్రకారం యాక్షన్ తీసుకోవాలి లా 45.5.6: బౌలింగ్ జట్టు తప్పు ఉందని తేలితే.. ఫీల్డ్ అంపైర్ బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. ఆ తర్వాత ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు బౌలింగ్ జట్టు కెప్టెన్‌కు వివరిస్తారు. లా 45.5.7: బౌలర్ వేసిన బంతిని పరిగణలోకి తీసుకోరు.. డెడ్‌బాల్‌గా కౌంట్ చేస్తారు. లా 45.5.8: ఈ తతంగమంతా జరిగే లోపల బ్యాటర్లు పరుగు తీస్తే.. దానిని రద్దు చేయడం జరుగుతుంది. అదే సమయంలో ప్రత్యర్థి బ్యాటర్లు సగం క్రీజు దాటితే మాత్రం పరుగు ఇవ్వడంతో పాటు అదనంగా ఐదు పరుగులు ఇస్తారు. లా 45.5.9: స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ తర్వాత బంతిని తాను ఆడాలా లేక నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ ఆడాలా అనే నిర్ణయం వాళ్లే తీసుకునే అవకాశం. లా 45.5.10: ఆటలో భాగంగా జరిగిన తప్పిదాన్ని మ్యాచ్‌లో పాల్గొన్న ఇద్దరు అంపైర్లు రాతపూర్వకంగా గవర్నింగ్ కౌన్సిల్‌కు అందజేయాల్సి ఉంటుంది. బౌలింగ్ జట్టుపై ఏ యాక్షన్ తీసుకున్నారనేది వివరించాలి. -
మన్కడింగ్‌పై నిషేదం.. విండీస్ దిగ్గజ బ్యాటర్ సంచలన వ్యాఖ్యలు
మన్కడింగ్‌ను నిషేధించడంతో పాటు క్యాచ్ అవుట్ అయినప్పుడు కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్‌కు రావడం, బంతికి లాలాజలాన్ని పూయడం వంటి పలు క్రికెట్ చట్టాలను మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఇటీవలే సవరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టాలపై దిగ్గజ క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఎంసీసీ నిబంధనలను స్వాగతించగా, వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రం ఎంసీసీ కొత్త నిబంధనలపై విమర్శలు గుప్పించాడు. మన్కడింగ్‌ను నిషేదించడంపై లారా స్పందిస్తూ.. బౌలర్ బంతి విసిరే క్రమంలో నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ పరుగు కోసం క్రీజ్‌ను వదలడం సహజమేనని, అలాంటి తరుణంలో బౌలర్ బెయిల్స్‌ను పడగొట్టి ఔట్‌కు అప్పీల్ చేయడం (ఈ తరహా రనౌట్ అప్పీల్‌ను మన్కడింగ్ అంటారు) క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఎంసీసీ తాజాగా ఇలాంటి అప్పీల్స్‌కు చట్టబద్దత కల్పిస్తూ రనౌట్‌గా పరిగణించడం ఎంత మాత్రం సబబు కాదని మండిపడ్డాడు. లారాకు ముందు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ కూడా ఎంసీసీ నూతన నిబంధనలపై ధ్వజమెత్తాడు. క్యాచ్ అవుట్ అయినప్పుడు కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్‌కు రావడం అనే రూల్‌పై నీషమ్ స్పందిస్తూ.. ఎంసీసీ ఈ అనవసర నిబంధన ఎందుకు అమల్లోకి తేవాలనుకుంటుందో అర్థం కావడం లేదని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే, మన్కడింగ్‌ను నిషేదిస్తూ ఎంసీసీ తీసుకున్న నిర్ణయంపై భారత క్రికెటర్లు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ పేరుతో ఈ తరహా రనౌట్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంసీసీ మన్కడ్ పేరుతో చలామణి అవుతున్న మన్కడింగ్ పదాన్ని నిషేధించి, ఆ తరహా ఔట్‌ను సాధారణ రనౌట్‌గా పరిగణించాలని నిర్ణయించింది. చదవండి: కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ స్పిన్ మాంత్రికుడికి కడసారి వీడ్కోలు -
మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చడం సంతోషం.. కానీ
క్రికెట్లో ఎంసీసీ(మెరిల్బోర్న్ క్రికెట్ అసోసియేషన్) సవరించిన కొత్త రూల్స్ సంతోషం కలిగించాయని టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. ''ఎంసీసీ కమిటీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ బాగున్నాయి.. అందులో కొన్నింటికి నేను మద్దతు ఇస్తున్నా. ముఖ్యంగా మన్కడింగ్ విషయంలో మార్పు తీసుకురావడం అభినందనీయం. క్రీజులో ఉన్న బ్యాటర్‌కు మన్కడింగ్ అనే పదం ఇబ్బందిగా అనిపించేది. తాజాగా మన్కడింగ్ పదాన్ని రనౌట్‌గా మార్చారు. నా దృష్టిలో మన్కడింగ్ అనేది రనౌట్‌గానే పరిగణిస్తారు. ఒక రకంగా ఇది మంచిదే అయినప్పటికి.. అందరికి సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు. ఇక రెండో రూల్ ఒక బ్యాట్స్‌మన్ క్యాచ ఔట్‌గా వెనుదిరిగినప్పుడు.. క్రీజులోకి కొత్త బ్యాటర్ రావాలనే నిర్ణయం కూడా బాగా నచ్చింది. ఎందుకంటే.. ఒక బౌలర్ వికెట్ తీసి సక్సెస్ ట్రాక్‌లో ఉండడం సక్సెస్‌గా కనిపించినప్పుడు.. అతను కొత్త బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయడం కూడా ఫెయిర్‌గానే కనిపిస్తుంది. ఈ కొత్త రూల్ బాగుంది.. వెల్డన్'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇది క్రికెట్లో రనౌట్! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్ కానే కాదిపుడు. ఎంసీసీ చేసిన పలు సవరణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే అమలవుతాయి. ఎంసీసీ సవరణలివి... ►సలైవా (ఉమ్ము), చెమటతో బంతిని రుద్దడం పూర్తిగా నిషిద్ధం. కరోనా వల్ల ఇప్పుడైతే చెమట, ఉమ్ముతో బంతిని షైన్ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇకపైనా కుదరదు. ►క్యాచ్ అవుట్ అయిన బ్యాటర్ సగం పిచ్ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్ చేయాలి. ఓవర్ చివరిబంతికి ఔటైతే తప్ప... సగం పిచ్ దాటిన నెపంతో నాన్ స్ట్రయికర్ బ్యాటింగ్ చేయడానికి వీలులేదు. ►ఫీల్డింగ్ సమయంలో ఎవరైన ఆటగాడు అనైతికంగా ఫీల్డ్‌లో కదిలితే ఇన్నాళ్లు అది డెడ్‌బాల్‌గానే పరిగణించేవారు. బ్యాటర్ భారీషాట్ ఆడినపుడు బ్యాటింగ్ జట్టుకు ఇది ప్రతికూలమయ్యేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్ జట్టుకు అనుకూలంగా మార్చారు. ఫీల్డర్ అనుచిత మార్పు చేస్తే ప్రత్యర్థి (బ్యాటింగ్) జట్టు స్కోరుకు ఐదు పెనాల్టీ పరుగులు జతచేస్తారు. -
మన్కడింగ్ తప్పుకాదు: ఐసీసీ
లండన్: మన్కడింగ్ గుర్తుందిగా..! బౌలింగ్ వేసే సమయంలో బంతి బౌలర్ చేతి నుంచి విడుదల కాకముందే నాన్‌స్ట్రయిక్ బ్యాటర్ పరుగు పెడితే బౌలర్ వికెట్లను గిరాటే వేయడమే మన్కడింగ్. ఐపీఎల్లో బట్లర్‌ను అశ్విన్ ఇలా అవుట్ చేస్తే పాశ్చత్య క్రికెటర్లు అతనిపై ధ్వజమెత్తారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని నానాయాగీ చేశారు. ఇప్పుడు క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇది క్రికెట్లో రనౌట్! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్ కానే కాదిపుడు. ఎంసీసీ చేసిన పలు సవరణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే అమలవుతాయి. ఎంసీసీ సవరణలివి... ►సలైవా (ఉమ్ము), చెమటతో బంతిని రుద్దడం పూర్తిగా నిషిద్ధం. కరోనా వల్ల ఇప్పుడైతే చెమట, ఉమ్ముతో బంతిని షైన్ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇకపైనా కుదరదు. ►క్యాచ్ అవుట్ అయిన బ్యాటర్ సగం పిచ్ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్ చేయాలి. ఓవర్ చివరిబంతికి ఔటైతే తప్ప... సగం పిచ్ దాటిన నెపంతో నాన్ స్ట్రయికర్ బ్యాటింగ్ చేయడానికి వీలులేదు. ►ఫీల్డింగ్ సమయంలో ఎవరైన ఆటగాడు అనైతికంగా ఫీల్డ్‌లో కదిలితే ఇన్నాళ్లు అది డెడ్‌బాల్‌గానే పరిగణించేవారు. బ్యాటర్ భారీషాట్ ఆడినపుడు బ్యాటింగ్ జట్టుకు ఇది ప్రతికూలమయ్యేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్ జట్టుకు అనుకూలంగా మార్చారు. ఫీల్డర్ అనుచిత మార్పు చేస్తే ప్రత్యర్థి (బ్యాటింగ్) జట్టు స్కోరుకు ఐదు పెనాల్టీ పరుగులు జతచేస్తారు. చదవండి: IPL 2022: అఫ్గన్ ఆటగాడికి బంపరాఫర్.. ఇక సాహాకు కష్టమే Aus Vs Pak: టెస్టుల్లో చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా! -
ఇప్పుడున్న రూల్స్‌కు లక్ష పరుగులు ఈజీగా కొట్టేవాడు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలో లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లు కలిపి అంతర్జాతీయ క్రికెట్లో 34,357 పరుగులు సాధించాడు. వన్డే,టెస్టులు కలిపి 100 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సచిన్ రికార్డును బ్రేక్ చేయడం కష్టతరమే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సచిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో జరిగిన యూట్యూబ్ ఇంటర్య్వులో అక్తర్ మాట్లాడాడు. చదవండి: చరిత్ర సృష్టించనున్న టీమిండియా.. రోహిత్‌కు అరుదైన గౌరవం ''క్రికెట్లో ఇప్పుడున్న రూల్స్ అన్ని బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉన్నాయి. రెండు కొత్త బంతుల నిబంధన.. మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌కు మూడు రివ్యూలు.. ఇలా ఏవి చూసుకున్నా బ్యాటర్స్‌కే అనుకూలంగా ఉంది. ఒకవేళ సచిన్ ఆడుతున్న సమయంలో ఇలాంటి రూల్స్ ఉండుంటే కచ్చితంగా లక్ష పరుగుల పైనే కొట్టేవాడు. కానీ సచిన్‌కు ఆ అవకాశం లేకుండా పోయింది. అందుకే సచిన్‌ను.. ''నేను పూర్ సచిన్'' అని పేర్కొంటున్నా. సచిన్ ఆడుతున్న సమయంలో దిగ్గజ బౌలర్లు వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, షేన్ వార్న్, బ్రెట్ లీ, మెక్‌గ్రాత్ సహా నాలాంటి బౌలర్లతో పాటు తర్వాతి జనరేషన్ బౌలర్లను కూడా ఎదుర్కొన్నాడు. అందుకే అతన్ని కఠినమైన బ్యాట్స్‌మన్‌గానూ అభివర్ణిస్తా'' అంటూ పేర్కొన్నాడు. అక్తర్ సమాధానం విన్న రవిశాస్త్రి తన సలహాను కూడా వెల్లడించాడు. ఇప్పుడున్న రూల్స్‌ను బ్యాలెన్స్ చేయాలంటే.. ఓవర్‌కు రెండు చొప్పున బౌన్సర్లు వేసేందుకు అనుమతి ఉంది. దాని లిమిట్‌ను పెంచితే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాడు. చదవండి: WI vs ENG: అనవసరంగా 20 పరుగులు.. సొంత జట్టుపై పొలార్డ్ అసహనం -
క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పు.. ఇకపై వారిని అలా పిలువరాదు
లండన్: క్రికెట్లో లింగభేదానికి తావు లేకుండా మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పురుష క్రికెటర్లను మాత్రమే సంబోధించే బ్యాట్స్‌మన్ అన్న పదాన్ని తొలగించి మహిళలు, పురుషులకు కామన్‌గా వర్తించేలా బ్యాటర్ అన్న పదాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని బుధవారం ప్రకటించింది. గత కొంత కాలంగా ఈ ప్రతిపాదన ఎంసీసీ పరిశీలనలో ఉండగా.. తాజాగా ఆమోదించబడింది. లింగభేదం లేని పదాన్ని ఉపయోగించడం వల్ల క్రికెట్ అందరి క్రీడ అని మరోసారి నిరూపించబడుతుందని ఎంసీసీ విశ్వసిస్తోంది. లింగభేదం లేని పదాలు వాడటం వల్ల మరింత మంది మహిళలు క్రికెట్ పట్ల ఆకర్షితులవుతారని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే, క్రికెట్‌కు సంబంధించి లింగభేదానికి ఆస్కారముండే థర్డ్ మ్యాన్, నైట్ వాచ్‌మన్, జెంటిల్మెన్ వంటి పదాలపై ఎంసీసీ ఎలాంటి కామెంట్లు చేయకపోవడం విశేషం. చదవండి: కెప్టెన్సీ విషయంలో వారిద్దరికీ పట్టిన గతే కోహ్లికి కూడా పట్టవచ్చు..! -
సచిన్ గురించి సత్య నాదెళ్ల ఏం చెప్పారంటే..!
ప్రపంచంలోనే అత్యుత్తమ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్. కంప్యూటర్‌కు నడకలు నేర్పి.. మెరుగులు దిద్ది ప్రపంచ మారుమూలలకు ఈ సాంకేతిక విప్లవాన్ని చేరువు చేసిన ఘనత మైక్రోసాఫ్ట్‌ది. అలాంటి ఉన్నతమైన సంస్థ ఇప్పుడు మన తెలుగుతేజం సత్యనాదెళ్ల నాయకత్వంలో ముందుకుసాగుతోంది. సాంకేతిక ప్రపంచంలో కొత్త శిఖరాలు అందుకుంటోంది. 'మైక్రోసాఫ్ట్' సీఈవోగా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు సాధించిన సత్య నాదెళ్ల అభిరుచులేమిటి? ఆయన ఇష్టాయిష్టాలేమిటి? పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఎలా ఉంటారు? ఎలా పనిచేస్తారు? ఎలా థింక్ చేస్తారు? సచిన్ బ్యాటుతో ఆయనకున్న అనుబంధమేమిటి? అమెరికాలో క్రికెట్ రూల్స్ వివరించాల్సి వస్తే ఆయనేం చేస్తారు? అంటే రెండు నిమిషాలకుపైగా నిడివి ఉన్న ఈ వీడియోలో వెల్లడించారు సత్య నాదెళ్ల. ప్రస్తుతం ఆన్లైన్ లో హల్ చల్ చేస్తున్న ఆ వీడియో.. అందులో సత్య చెప్పిన సమాధానాలు మీకోసం ఇక్కడ.. మీరు త్వరగా నిద్ర లేస్తారా? లేక రాత్రుళ్లు మేల్కుంటారా? పొద్దున్నే లేస్తాను.. కాఫీ తాగుతారా? లేక 'టీ'నా? ఉదయాన్నే కాఫీ, మధ్యాహ్నం టీ తాగుతాను.. పొద్దున్న లేవగానే మీరు చేసే పని ఏంటిది? రన్నింగ్ షూస్ వేసుకోవడం మీరు పనిచేసే డెస్క్ మీద ఏముంటుంది? లెక్కపెట్టలేనన్ని కంప్యూటర్స్ ఉంటాయి మీ స్మార్ట్ ఫోన్ హోం స్క్రీన్ మీద ఏముంటుంది? వండర్ లిస్ట్ నంబర్ వన్ ఐకాన్ ఉంటుంది కామిక్ సాన్స్ ఫాంట్ మంచిదా లేక చెడ్డదా? మంచి ఫాంటే మీ వర్క్ డేలో మీ ఫేవరెట్ టైం వేస్టర్ ఏమిటి? కొటారా జోక్స్ మీరు అత్యంత అపురూపంగా భావించే వస్తువేంటిది? సచిన టెండూల్కర్ సంతకం చేసి ఇచ్చిన క్రికెట్ బ్యాట్ స్టీవ్ బాల్మెర్‌తో క్లిప్పర్స్ గేమ్ ఆడటం ఇష్టమా లేక బిల్ గేట్స్ తో బ్రిడ్జ్ గేమ్ ఆడటమా? (నవ్వుతూ) స్టీవ్ బాల్మర్తో క్లిప్పర్స్ గేమ్ ఆడటమే ఇష్టమనుకుంటా.. ఒక సమావేశాన్ని మీరు ఎలా నిర్వహిస్తారు? ఎక్కువ విను. తక్కువ మాట్లాడు. సమయమొచ్చిన నిర్ణయాత్మకంగా వ్యవహరించు.. కొత్తగా నియమించుకునేవారిలో మీరు కోరుకునే లక్షణం.. స్పష్టత, ఎనర్జీ (ఉత్సాహం) మీరు అమెరికాలో ఎవరికైనా క్రికెట్ రూల్స్ వివరించాల్సి వస్తే.. ఏ విషయాన్ని చెప్తారు? (నవ్వుతూ) ఇట్స్ ఇంపాజిబుల్.. మీపై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులు ఎవరు? మా తల్లిదండ్రులు.. మా నాన్న ఆర్థికవేత్త, లెఫ్టిస్ట్,మార్క్సిస్టు కూడా. మా అమ్మ సంస్కృత ప్రొఫెసర్. వాళ్ల అభిప్రాయాల్లో పెద్దగా ఏకీభావం ఉండేది కాదు. అదే నాకు సొంత దృక్పథాన్ని ఏర్పరుచుకునేందుకు వీలు కల్పించింది. వాళ్లు గొప్ప విలువలు పాటించారు. అవి నాకెంతగానో ఉపయోగపడ్డాయి. మీరు పొందిన వృత్తిపరమైన ఉత్తమ సలహా ఏది? నువ్వు చేయగలవనుకున్న దాని కన్నా ఎక్కువే.. నిన్ను నువ్వు నమ్ము..