సచిన్ గురించి సత్య నాదెళ్ల ఏం చెప్పారంటే..! | Sakshi
Sakshi News home page

సచిన్ గురించి సత్య నాదెళ్ల ఏం చెప్పారంటే..!

Published Wed, Feb 3 2016 4:11 AM

సచిన్ గురించి సత్య నాదెళ్ల ఏం  చెప్పారంటే..!

ప్రపంచంలోనే అత్యుత్తమ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌. కంప్యూటర్‌కు నడకలు నేర్పి.. మెరుగులు దిద్ది ప్రపంచ మారుమూలలకు ఈ సాంకేతిక విప్లవాన్ని చేరువు చేసిన ఘనత మైక్రోసాఫ్ట్‌ది. అలాంటి ఉన్నతమైన సంస్థ ఇప్పుడు మన తెలుగుతేజం సత్యనాదెళ్ల నాయకత్వంలో ముందుకుసాగుతోంది. సాంకేతిక ప్రపంచంలో కొత్త శిఖరాలు అందుకుంటోంది. 'మైక్రోసాఫ్ట్‌' సీఈవోగా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు సాధించిన సత్య నాదెళ్ల అభిరుచులేమిటి? ఆయన ఇష్టాయిష్టాలేమిటి? పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఎలా ఉంటారు? ఎలా పనిచేస్తారు? ఎలా థింక్ చేస్తారు? సచిన్ బ్యాటుతో ఆయనకున్న అనుబంధమేమిటి? అమెరికాలో క్రికెట్ రూల్స్‌ వివరించాల్సి వస్తే ఆయనేం  చేస్తారు? అంటే రెండు నిమిషాలకుపైగా నిడివి ఉన్న ఈ వీడియోలో వెల్లడించారు సత్య నాదెళ్ల. ప్రస్తుతం ఆన్‌లైన్‌ లో హల్ చల్‌ చేస్తున్న ఆ వీడియో.. అందులో సత్య చెప్పిన సమాధానాలు మీకోసం ఇక్కడ..

మీరు త్వరగా నిద్ర లేస్తారా? లేక రాత్రుళ్లు మేల్కుంటారా?
పొద్దున్నే లేస్తాను..

కాఫీ తాగుతారా? లేక 'టీ'నా?
ఉదయాన్నే కాఫీ, మధ్యాహ్నం టీ తాగుతాను..

పొద్దున్న లేవగానే మీరు చేసే పని ఏంటిది?
రన్నింగ్ షూస్ వేసుకోవడం

మీరు పనిచేసే డెస్క్ మీద ఏముంటుంది?
లెక్కపెట్టలేనన్ని కంప్యూటర్స్ ఉంటాయి

మీ స్మార్ట్ ఫోన్ హోం స్క్రీన్ మీద ఏముంటుంది?
వండర్ లిస్ట్ నంబర్ వన్ ఐకాన్ ఉంటుంది

కామిక్ సాన్స్ ఫాంట్ మంచిదా లేక చెడ్డదా?
మంచి ఫాంటే

మీ వర్క్ డేలో మీ ఫేవరెట్ టైం వేస్టర్ ఏమిటి?
కొటారా జోక్స్

మీరు అత్యంత అపురూపంగా భావించే వస్తువేంటిది?
సచిన టెండూల్కర్ సంతకం చేసి ఇచ్చిన క్రికెట్ బ్యాట్

స్టీవ్ బాల్మెర్‌తో క్లిప్పర్స్ గేమ్ ఆడటం ఇష్టమా లేక బిల్ గేట్స్ తో బ్రిడ్జ్ గేమ్ ఆడటమా?
(నవ్వుతూ) స్టీవ్ బాల్మర్‌తో క్లిప్పర్స్ గేమ్ ఆడటమే ఇష్టమనుకుంటా..

ఒక సమావేశాన్ని మీరు ఎలా నిర్వహిస్తారు?
ఎక్కువ విను. తక్కువ మాట్లాడు. సమయమొచ్చిన నిర్ణయాత్మకంగా వ్యవహరించు..

కొత్తగా నియమించుకునేవారిలో మీరు కోరుకునే లక్షణం..
స్పష్టత, ఎనర్జీ (ఉత్సాహం)

మీరు అమెరికాలో ఎవరికైనా క్రికెట్ రూల్స్ వివరించాల్సి వస్తే.. ఏ విషయాన్ని చెప్తారు?
(నవ్వుతూ) ఇట్స్ ఇంపాజిబుల్..

మీపై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులు ఎవరు?
మా తల్లిదండ్రులు.. మా నాన్న ఆర్థికవేత్త, లెఫ్టిస్ట్,మార్క్సిస్టు కూడా. మా అమ్మ సంస్కృత ప్రొఫెసర్. వాళ్ల అభిప్రాయాల్లో పెద్దగా ఏకీభావం ఉండేది కాదు. అదే నాకు సొంత దృక్పథాన్ని ఏర్పరుచుకునేందుకు వీలు కల్పించింది. వాళ్లు గొప్ప విలువలు పాటించారు. అవి నాకెంతగానో ఉపయోగపడ్డాయి.  

మీరు పొందిన వృత్తిపరమైన ఉత్తమ సలహా ఏది?
నువ్వు చేయగలవనుకున్న దాని కన్నా ఎక్కువే.. నిన్ను నువ్వు నమ్ము..

Advertisement
 
Advertisement
 
Advertisement