
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలో లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లు కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో 34,357 పరుగులు సాధించాడు. వన్డే,టెస్టులు కలిపి 100 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సచిన్ రికార్డును బ్రేక్ చేయడం కష్టతరమే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సచిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో జరిగిన యూట్యూబ్ ఇంటర్య్వులో అక్తర్ మాట్లాడాడు.
చదవండి: చరిత్ర సృష్టించనున్న టీమిండియా.. రోహిత్‌కు అరుదైన గౌరవం
''క్రికెట్‌లో ఇప్పుడున్న రూల్స్ అన్ని బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉన్నాయి. రెండు కొత్త బంతుల నిబంధన.. మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌కు మూడు రివ్యూలు.. ఇలా ఏవి చూసుకున్నా బ్యాటర్స్‌కే అనుకూలంగా ఉంది. ఒకవేళ సచిన్ ఆడుతున్న సమయంలో ఇలాంటి రూల్స్ ఉండుంటే కచ్చితంగా లక్ష పరుగుల పైనే కొట్టేవాడు. కానీ సచిన్‌కు ఆ అవకాశం లేకుండా పోయింది. అందుకే సచిన్‌ను.. ''నేను పూర్ సచిన్'' అని పేర్కొంటున్నా. సచిన్ ఆడుతున్న సమయంలో దిగ్గజ బౌలర్లు వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, షేన్ వార్న్, బ్రెట్ లీ, మెక్‌గ్రాత్ సహా నాలాంటి బౌలర్లతో పాటు తర్వాతి జనరేషన్ బౌలర్లను కూడా ఎదుర్కొన్నాడు. అందుకే అతన్ని కఠినమైన బ్యాట్స్‌మన్‌గానూ అభివర్ణిస్తా'' అంటూ పేర్కొన్నాడు.
అక్తర్ సమాధానం విన్న రవిశాస్త్రి తన సలహాను కూడా వెల్లడించాడు. ఇప్పుడున్న రూల్స్‌ను బ్యాలెన్స్ చేయాలంటే.. ఓవర్‌కు రెండు చొప్పున బౌన్సర్లు వేసేందుకు అనుమతి ఉంది. దాని లిమిట్‌ను పెంచితే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాడు.
చదవండి: WI vs ENG: అనవసరంగా 20 పరుగులు.. సొంత జట్టుపై పొలార్డ్ అసహనం
Comments
Please login to add a commentAdd a comment