క్రికెట్ అభిమానులకు మరో టీ20 లీగ్ కనువిందు చేయనుంది. నవంబర్ 17 నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) తొలి ఎడిషన్ ప్రారంభం కానుంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న ఈ లీగ్‌కు సంబంధించిన ఫిక్షర్స్ మరియు కెప్టెన్ల వివరాలను నిర్వహకులు ఇవాళ (అక్టోబర్ 8) వెల్లడించారు.
నవంబర్ 17 నుంచి డిసెంబర్ 8 వరకు సాగే ఈ లీగ్ భారత్‌లోని మూడు వేర్వేరు వేదికలపై (ముంబై, లక్నో, రాయ్‌పూర్) జరుగనుంది. ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగుతాయి.
ఈ లీగ్‌లో భారత్ సహా ఆరు ఐసీసీ సభ్యు దేశాలు పాల్గొంటున్నాయి. ఈ లీగ్‌లో భారత జట్టుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సారథ్యం వహించనున్నాడు. శ్రీలంక జట్టుకు కుమార సంగక్కర, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా కెప్టెన్లు వహించనున్నారు.
లీగ్ ఫిక్షర్స్..
నవంబర్ 17- భారత్ వర్సెస్ శ్రీలంక (ముంబై, రాత్రి 7:30 గంటలకు)
నవంబర్ 18- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా (ముంబై, రాత్రి 7:30 గంటలకు)
నవంబర్ 17- శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (ముంబై, రాత్రి 7:30 గంటలకు)
నవంబర్ 20- వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా (ముంబై, రాత్రి 7:30 గంటలకు)
నవంబర్ 21- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)
నవంబర్ 23- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)
నవంబర్ 24- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)
నవంబర్ 25- వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక (లక్నో, రాత్రి 7:30 గంటలకు)
నవంబర్ 26- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)
నవంబర్ 27- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (లక్నో, రాత్రి 7:30 గంటలకు)
నవంబర్ 28- భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
నవంబర్ 30- శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
డిసెంబర్ 1- భారత్ వర్సెస్ వెస్టిండీస్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
డిసెంబర్ 2- శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
డిసెంబర్ 3- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
డిసెంబర్ 5- సెమీఫైనల్-1 (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
డిసెంబర్ 6- సెమీఫైనల్-2 (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
డిసెంబర్ 8- ఫైనల్ (రాయ్‌పూర్, రాత్రి 7:30 గంటలకు)
చదవండి: PAK VS ENG 1st Test: జమాల్ 'కమాల్' క్యాచ్
Comments
Please login to add a commentAdd a comment