టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిలో మునుపటి ఊపు లేదని హాగ్ ఆరోపించాడు. పరుగులు సాధించడంలో విరాట్ లయ తప్పాడని హాగ్ అన్నాడు. గత కొంతకాలంగా విరాట్ టెస్ట్‌ల్లో అంత గొప్ప ప్రదర్శనలేమీ చేయడం లేదని తెలిపాడు. ఇలాగే ఆడితే విరాట్ సచిన్ రికార్డులు అధిగమించడం కష్టమని అభిప్రాయపడ్డాడు.
మాస్టర్ బ్లాస్టర్ తన కెరీర్‌లో 200 టెస్ట్‌లు ఆడి 15,921 పరుగులు చేయగా.. 35 ఏళ్ల విరాట్ ఇప్పటివరకు 114 టెస్ట్‌లు ఆడి 8871 పరుగులు మాత్రమే సాధించాడని హాగ్ అన్నాడు. విరాట్ సచిన్ రికార్డును అధిగమించాలంటే మరో 7051 పరుగులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఫామ్‌తో కోహ్లి ఇన్ని పరుగులు సాధించడం దాదాపుగా అసాధ్యమే అని హాగ్ అభిప్రాయపడ్డాడు.
టెస్ట్‌ల్లో గత కొన్ని సంవత్సరాలుగా కోహ్లి అస్థిరమైన ఫామ్ అతన్ని వెనక్కు నెట్టిందని హాగ్ పేర్కొన్నాడు. విరాట్ సచిన్ రికార్డులకు చేరవగా వెళ్లాలంటే తదుపరి 10 టెస్ట్‌ల్లో తిరిగి తన లయను అందుకోవాల్సి ఉంటుందని అన్నాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ హాగ్ ఈ విషయాలను ప్రస్తావించాడు.
కాగా, ఫాబ్ ఫోర్‌గా చెప్పుకునే విరాట్, రూట్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌లలో జో రూట్ సచిన్ రికార్డు దిశగా దూసుకెళ్తున్నాడు. ఇటీవలికాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న రూట్ ఇప్పటివరకు 146 టెస్ట్‌లు ఆడి 12402 పరుగులు చేశాడు. రూట్ టెస్ట్‌ల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డు బద్దలు కొట్టాలంటే మరో 3500 పైచిలుకు పరుగులు సాధిస్తే చాలు. రూట్ ప్రస్తుత ఫామ్ ప్రకారం ఇది అసాధ్యమేమి కాకపోవచ్చు.
చదవండి: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్.. జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment