టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యాడు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌లో విరాట్ మరో 58 పరుగులు చేస్తే సచిన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ 27000 రన్స్ రికార్డును (అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో) బద్దలు కొడతాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 27000 పరుగుల మార్కును అందుకునేందుకు సచిన్‌కు 623 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. విరాట్‌కు 594 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. విరాట్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 593 ఇన్నింగ్స్‌లు ఆడి 26942 పరుగులు చేశాడు.
సచిన్ ఓవరాల్‌గా 782 ఇన్నింగ్స్‌ల్లో 34357 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే 27000 పరుగుల మార్కును అందుకున్నారు.
వీరిలో సచిన్ అగ్రస్థానంలో ఉండగా.. సంగక్కర (28016), రికీ పాంటింగ్ (27483) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. బంగ్లాతో మ్యాచ్‌లో విరాట్ మరో 58 పరుగులు చేస్తే ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్ అవుతాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో విరాట్ మరో 1075 పరుగులు చేస్తే.. సచిన్ తర్వాత రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.
ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి.. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయి. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.
తొలి టెస్ట్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: ట్రిపుల్ సెంచరీకి చేరువలో కుల్దీప్
Comments
Please login to add a commentAdd a comment