కరాచి : తనకు అవకాశమొస్తే టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. హలో యాప్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో.. మీకు టీమిండియాకు బౌలింగ్ కోచ్‌గా అవకాశమొస్తే చేస్తారా అంటూ ప్రశ్నించగా.. దానికి అక్తర్ పాజిటివ్‌గా స్పందించాడు.' ప్రస్తుతం భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా అరుణ్ భరత్ కొనసాగుతున్నాడు. ఒకవేళ టీమిండియా బౌలింగ్ కోచ్‌గా అవకాశమొస్తే పని చేయడానికి ఇష్టపడతా. బౌలింగ్‌లో నాకున్న జ్ఞానంతో పాటు ఆలోచనలను యువ ఆటగాళ్లతో పంచుకునేందుకు నిరంతరం సిద్ధంగా ఉంటా. జట్టులోని ప్రతీ బౌలర్‌తో కలివిడిగా ఉంటూనే సఖ్యతగా మెలుగుతా. అంతేగాక బ్యాట్స్‌మన్ వికెట్లు తీయడానికి పాటించాల్సిన చిట్కాలను వారికి అందిస్తా. అలాగే ఆఫర్ వస్తే ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కూడా కోచ్‌గా పనిచేయడానికి ఎదురుచూస్తున్నా' అంటూ పేర్కొన్నాడు. (షోయబ్ అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు)
దీంతో పాటు సచిన్ టెండూల్కర్‌తో తనకున్న అనుబంధాన్ని అక్తర్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. 1998లో మొదటిసారి సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. తనకు సచిన్ పేరు తెలుసని.. కానీ చెన్నైలో జరిగిన మ్యాచ్ ద్వారా సచిన్‌ను వారి దేశంలో క్రికెట్ దేవుడిగా అభివర్ణిస్తారని అప్పుడే తెలుసుకున్నట్లు తెలిపాడు. ఇండియాలో కూడా తనకు చాలా మంది అభిమానులున్నారని అక్తర్ చెప్పుకొచ్చాడు.
(నజీర్‌కు సెహ్వాగ్ లాంటి బుర్ర లేదు : అక్తర్)
(డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది : ఫించ్)
Comments
Please login to add a commentAdd a comment