Shoaib Akhtar: నీ చాలెంజ్‌ ఒప్పుకుంటున్నా.. బైక్‌ కొనడానికి రెడీగా ఉండు | Shoaib Akhtar Got Reply Challenge To Actor Gift Motorbike Face Six Balls | Sakshi
Sakshi News home page

Shoaib Akhtar: నీ చాలెంజ్‌ ఒప్పుకుంటున్నా.. బైక్‌ కొనడానికి రెడీగా ఉండు

Published Fri, Jun 4 2021 6:00 PM | Last Updated on Fri, Jun 4 2021 8:11 PM

Shoaib Akhtar Got Reply Challenge To Actor Gift Motorbike Face Six Balls - Sakshi

రావల్పిండి: పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆటకు దూరమైనా.. ఎంటర్‌టైన్‌మెంట్‌కు దూరం కాలేదు. ఆటలో ఎన్ని వివాదాలు వచ్చినా తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చలకీగా ఉంటాడు. క్రికెట్‌ చరిత్రలో గంటకు వంద మీటర్ల వేగంతో బంతులు విసరడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి వారిలో అక్తర్‌ కూడా ఒకడు. అతను వేసే వేగానికి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కాగా షోయబ్‌ 100 మీటర్ల వేగంతో విసిరే బంతులపై పాక్‌ ఫేమస్‌ యాక్టర్‌ ఫహద్‌ ముస్తఫా కొన్ని రోజుల క్రితం ట్విటర్‌లో ఫన్నీగా స్పందించాడు. ''అక్తర్‌ నీ వేగాన్ని తట్టుకోలేం.. దానికంటే ఇంట్లో ముసుగుతన్ని పడుకోవడం బెటర్‌'' అంటూ కామెంట్‌ చేశాడు. దీనికి అక్తర్‌ తనదైన శైలిలో ఫన్నీ కౌంటర్‌ ఇచ్చాడు. ''ఫహన్‌ నేను వేసిన ఆరు బంతులు ఆడు చాలు.. నీకు మోటార్‌ సైకిల్‌ కొనిస్తా'' అంటూ చాలెంజ్‌ చేశాడు. అయితే అక్తర్‌ ట్వీట్‌పై ఫహద్‌ ఏం స్పందించలేదు.

తాజాగా అక్తర్‌ ఫహద్‌కు ఇచ్చిన చాలెంజ్‌ను తాను ఒప్పుకుంటున్నానంటూ పాకిస్తాన్‌ మానవవనరుల అభివృద్ధి మాజీ అధికారి సయ్యద్‌ జుల్ఫికర్‌ బుకారీ తెలిపాడు. దీనికి సంబంధించి అక్తర్‌, బుకారీల మధ్య ట్విటర్‌లో ఆసక్తికర చర్చ నడిచింది. బుకారీ స్పందనపై అక్తర్‌ ఒక నిమిషం ఆలోచించి రీట్వీట్‌ చేశాడు. ''బుకారీ మీరు బాగానే ఉన్నారా.. నేను ఇచ్చిన చాలెంజ్‌ మీకు అర్థమైందా'' అంటూ అడిగాడు.

దానికి బుకారీ.. ''అక్తర్‌ నువ్వు ఇచ్చిన చాలెంజ్‌పై నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నా.. ఒకవేళ నేను ఒక్క బాల్‌ మిస్‌ అయినా.. ప్రతీ బంతి చొప్పున బైక్‌ ఇ‍వ్వడానికి సిద్ధం'' అని చెప్పాడు. దానికి అక్తర్‌ బదులిచ్చాడు. '' బుకారీ నేను వేసే ఒక్కో బంతి మీ బ్యాట్‌ను తాకిన ప్రతీసారి బైక్‌ ఇవ్వడానికి రెడీగా ఉన్నా.. మీరు సిద్ధమా'' అంటూ ట్వీట్‌ చేశాడు. అయితే అక్తర్‌ ట్వీట్‌పై బుకారీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన చాట్‌ మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: WTC Final: ఐసీసీ ఈవెంట్లు ఇద్దరికి కలిసి రాలేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement