లాహోర్ : తరచూ ఏదో ఒక వివాదంలో ఉండే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని ఒత్తిడి తెచ్చి ఉంటే అతన్ని కచ్చితంగా చంపేసివాడినంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టులో కొంతమంది ఆటగాళ్లు ఇలాగే మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడి తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నారని, దీంతో పాక్ క్రికెట్ మసకబారిదంటూ గతేడాది ఇదే సమయంలో అక్తర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. ('ఆ మ్యాచ్‌లో మియాందాద్ వాడిన బ్యాట్ నాదే')
తాజాగా అక్తర్ మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేస్తూ..' వసీం అక్రమ్ ఒకవేళ నన్ను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని ఒత్తిడి తెచ్చి ఉంటే కచ్చితంగా అతన్ని నాశనం చేయడమో లేదా చంపేయాడానికి సిద్దపడేవాన్ని. కానీ అక్రమ్ అలాంటి ప్రతిపాధనతో నా ముందుకు ఎప్పుడు రాలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందామంటూ నా దగ్గరకు బూకీలు వచ్చిన ప్రతీసారి వారిని వెనక్కి పంపించాను.నేను పాకిస్తాన్‌ను ఎప్పుడూ మోసం చేయకూడదని భావించా. 21 మంది ఆడే ఆటలో ఎంతమంది మ్యాచ్ ఫిక్సర్లు ఉన్నారనేది ఎవరు చెప్పలేరు. అంతేగాక తాను అక్రమ్‌తో కలిసి 1990వ దశకంలో ఆడాను. అతను ఎప్పుడు తప్పుడు దారిని ఏంచుకోలేదు. తన అద్బుతమైన బౌలింగ్‌తో కష్టాల్లో ఉన్న పాక్ జట్టును ఎన్నోసార్లు గెలిపించాడు. (నా తమ్ముడు అప్పుడు.. ఇప్పుడు ఏం మారలేదు)
అక్రమ్‌తో కలిసి ఎనిమిది సంవత్సరాలు ఆడిన విషయం నాకు బాగా గుర్తుంది. టాప్ ఆర్డర్ పని తాను చూసుకుంటానని.. నువ్వు టెయిలెండర్లను ఔట్ చేసే బాధ్యత నీదేనంటూ అక్రమ్ నాతో చెప్పేవాడు. బహుశా అందుకేనేమో క్రికెట్ ఆడే సమయంలో నాకు అక్రమ్‌ను గౌరవించాలని అనిపించలేదు. నన్ను బౌలింగ్ విషయంలో మాత్రం ఎప్పుడూ మెచ్చుకుంటాడని, బౌలింగ్‌లో వైవిధ్యం చూపించేలా ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. ఆటకు దూరమైన తర్వాత నేను అక్రమ్‌ను పర్సనల్‌గా కలిసి నా ప్రవర్తనను క్షమించమని కోరానంటూ' చెప్పుకొచ్చాడు.షోయబ్ అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment