పాక్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ తన ఆత్మకథ సుల్తాన్-ఎ-మొమొయర్ ద్వారా మరోసారి సంచలన విషయాలు బయపెట్టాడు. గ్రేడ్ క్రికెటర్స్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అక్రమ్ కొన్ని ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడేందుకు నాకు ఇష్టం లేకున్నా దాదాపు రెండున్నర నెలల పాటు రీహాబిలిటేషన్‌లో ఉండడం నరకంలా అనిపించదని పేర్కొన్నాడు. అంతేకాదు ఒకరికి ఇష్టం లేని ప్రదేశంలో ఉండడం ప్రపంచానికి చట్టవిరుద్ధం అనిపించొచ్చు.. కానీ పాకిస్తాన్‌లో మాత్రం అలా ఉండదన్నాడు.
అక్రమ్ మాట్లాడుతూ.. ''ఇంగ్లండ్‌లో ఒక పార్టీకి వెళ్లినప్పుడు తెలియకుండానే కొకైన్‌కు బానిసగా మారిపోయా. ఎంతలా అంటే కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగేలాగా. తొలిసారి కొకైన్ రుచి చూడడం ఇప్పటికి నాకు గుర్తు. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఒకసారి ప్రయత్నిస్తారా అని అడిగాడు. అప్పటికే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడంతో పెద్దగా ఇబ్బంది ఉండదనుకొని తొలిసారి కొకైన్ రుచి చూశాను.. అందునా ఒక గ్రామ్ కొకైన్ మాత్రమే. ఆ తర్వాత పాకిస్తాన్‌కు తిరిగి వచ్చేశా. అయితే కొకైన్‌లో ఏదో తెలియని పదార్థం నా మనసును జివ్వుమని లాగడం మొదలుపెట్టింది.
ఒక్కసారి రుచి చూసిన పాపానికి ఆ తర్వాత దానికి ఎడిక్ట్‌గా మారిపోయాడు. ఇక కొకైన్ లేనిదే నా జీవితం లేదు అనే స్టేజ్‌కు వచ్చేశాను. అలా నా పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పటికే నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారిని చాలా బాధపెట్టాను.. కొన్నిసార్లు గొడవలు కూడా జరిగాయి. దీంతో వెంటనే నా భార్య నీకు చికిత్స అత్యవసరమని చెప్పింది. మా ఇంటికి కొద్ది దూరంలోనే రీహాబిలిటేషన్ సెంటర్ ఉండడంతో అక్కడ జాయిన్ అవ్వమని చెప్పింది. నేను నెలరోజులు మాత్రమే ఉండడానికి అంగీకరించాను. కానీ నాకు తెలియకుండానే అక్కడ దాదాపు రెండున్నర నెలల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. మనకు ఇష్టం లేని ప్రదేశంలో ఉండడం ప్రపంచంలో చట్టవిరుద్ధం కావొచ్చు.. కానీ పాకిస్తాన్‌లో అలా కాదు.
చివరికి అక్కడి నుంచి బయటపడిన తర్వాత కూడా పెద్దగా ఏం అనిపించలేదు. ఒక రకంగా నా ఇష్టానికి వ్యతిరేకంగా ఒక భయంకరమైన ప్రదేశంలో ఉండాల్సి వచ్చిందని చాలా బాధపడ్డాను. ఇక ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో రీహాబిలిటేషన్ సెంటర్‌లు చాలా విశాలంగా ఉంటాయి. కానీ పాకిస్తాన్‌లో అలా కాదు. కేవలం కారిడార్‌తో కలిపి ఎనిమిది గదులు మాత్రమే ఉంటాయి. దీంతో ఆ ప్రదేశం నిత్య నరకంలా అనిపించి భయంగా గడపాల్సి వచ్చింది.
అందులో నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజులకే నా జీవితంలో అతి పెద్ద విషాదం చోటుచేసుకుంది. నా భర్యా చనిపోవడం నా జీవితాన్ని సరిదిద్దింది. విదేశాల్లో ప్రతీ తండ్రి పిల్లల పట్ల ఎంతో కేరింగ్‌గా ఉంటారు. కానీ మా దేశంలో ఇవన్నీ ఇంట్లోని ఆడవాళ్లు మాత్రమే చూసుకుంటారు. నా భర్య చనిపోవడంతో నాలో మార్పు మొదలైంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం.. అవసరమైన సందర్భాల్లో వారికి అండగా నిలబడడం.. కొన్నిసార్లు వారు చదివే పాఠశాలకు వెళ్లడం.. పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కు హాజరవ్వాల్సి వచ్చేది. ఈ విషయంలో ఇతర పిల్లల తల్లిదండ్రులు ఎంతో సహకారం అందించారు.'' అంటూ ముగించాడు.
చదవండి: ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్.. బిర్యానీ కథ తెలుసుకోవాల్సిందే
గాయం పేరు చెప్పి టూర్‌కు దూరం.. కట్‌చేస్తే ఎన్నికల ప్రచారంలో
Comments
Please login to add a commentAdd a comment