
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ జట్టుపై భారత మహిళా జట్టుకు మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 406 చేసింది.
దీంతో భారత్ 187 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 74 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. భారత్ ముందు 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ మాత్రం తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకుంది.
ఏమి జరిగిందంటే?
ఈ చారిత్రత్మక విజయం అనంతరం ట్రోఫీని అందుకున్న భారత జట్టు ఛాంపియన్స్ హోర్డింగ్ వెనక ఉండి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలో అలిస్సా హీలీ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తింది. భారత జట్టు విన్నింగ్ మూమెంట్స్‌ను కెమెరాలో బంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓడిపోయినప్పటికీ అలిస్సా హీలీ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అయిపోయారు. హీలీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
చదవండి: T20 World Cup 2024: ఇంగ్లండ్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా కీరన్ పొలార్డ్..
Alyssa Healy 🫶
— Women's CricInsight (@WCI_Official) December 24, 2023
🎥: Jio Cinema@ahealy77 | @AusWomenCricket | #INDvAUS | #CricketTwitter pic.twitter.com/QVQpaagsGl