మహిళల క్రికెట్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బంతితో రాణించిన (3/19) అన్నాబెల్.. ఆతర్వాత బ్యాట్‌తో విశ్వరూపం ప్రదర్శించింది. ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేవలం 248 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి ఔరా అనిపించింది.
ఈ మ్యాచ్‌లో మొత్తం 256 బంతులు ఎదుర్కొన్న అన్నాబెల్ 210 పరుగులు చేసి ఔటైంది. ఆన్నాబెల్.. టెయిలెండర్లు ఆష్లే గార్డ్‌నర్ (65), కిమ్ గార్త్ (49 నాటౌట్), సోఫీ మోలినెక్స్ (33) సహకారంతో డబుల్ సెంచరీ పూర్తి చేసింది. అంతకుముందు కెప్టెన్ అలైసా హీలీ (99), బెత్ మూనీ (78) కూడా రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 575 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లాస్, టైరాన్ తలో 3 వికెట్లు, డి క్లెర్క్ 2, టక్కర్ ఓ వికెట్ పడగొట్టారు.
దీనికి ముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే ఆలౌటైంది. డార్సీ బ్రౌన్ (5/25), అన్నాబెల్ (3/19), తహిళ మెక్‌గ్రాత్ (2/4) సౌతాఫ్రికాను కుప్పకూల్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో సూన్ లస్ (26), పదో నంబర్ ప్లేయర్ క్లాస్ ఝ(10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఇది రెండో రోజు మాత్రమే. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ప్రస్తుతం ఆసీస్ 499 పరుగుల ఆధిక్యంలో ఉంది. సౌతాఫ్రికా మహిళా జట్టుకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్.
Comments
Please login to add a commentAdd a comment