
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రోల్టన్
ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ సారథి కరెన్ రోల్టన్‌కు ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టు సందర్భంగా ఆమెకు ఈ పురస్కారం అందజేశారు.
తొలి రోజు ఆటలో డిన్నర్ బ్రేక్ సమయంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ ఆమెకు ప్రత్యేక క్యాప్‌ను అందజేశారు. ఐసీసీ విశిష్ట క్రికెటర్ల జాబితాలో ఓవరాల్‌గా ఆమె 81వ ప్లేయర్‌కాగా... ఆరో మహిళా క్రికెటర్.