
ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy) తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. కరాచీ వేదికగా కివీస్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్‌టైన్ చేసినందుకు పాక్ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐసీసీ 5 శాతం కోత విధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో పాక్ తమ 50 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది.
దీంతో కొత్త రూల్స్ ప్రకారం.. మొదటి ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో పాక్ 30-యార్డ్ సర్కిల్‌లో అదనపు ఫీల్డర్‌తో ఫీల్డింగ్ చేయవలిసి వచ్చింది. దాంతో పాటుగా ఈ జరిమానా కూడా పాక్ జట్టుపైన పడింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా ఫిర్యాదు మెరకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ చర్యలు తీసుకున్నాడు. అదేవిధంగా తన తమ తప్పిదాన్ని రిజ్వాన్ అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ కేవలం ఫైన్‌తోనే సరిపెట్టాడు.
తొలి మ్యాచ్‌లో చిత్తు..
కాగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. 321 పరుగుల లక్ష్య చేధనలో పాక్ జట్టు 260 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్ష్‌బ్యాటర్లలో ఖుష్‌దిల్ షా (49 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (90 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు.
కివీస్ బౌలర్లలో శాంట్నర్, ఓ రూర్క్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ రెండు వికెట్లు సాధించాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ లాథమ్ (104 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్ యంగ్ (113 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు.
జమాన్ దూరం..
కాగా పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్ ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో జమాన్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ మధ్యలోనే జమాన్ వైదొలగాడు. అతడి స్ధానాన్ని ఇమామ్ ఉల్ హక్‌తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్‌తో తలపడనుంది.
చదవండి: Champions Trophy: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment