భారత్, థాయ్‌లాండ్ మహిళా జట్లు (PC: AsianCricketCouncil)
Womens Asia Cup T20 2022 : మహిళల ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో బంగ్లాదేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. వరణుడు ఆటంకం కలిగించిన కారణంగా ఆ జట్టు సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. దీంతో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నుంచి నిష్క్రమించింది.
మ్యాచ్ రద్దు!
ఇక బంగ్లా నిష్క్రమణతో థాయ్‌లాండ్ నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. సెల్హెట్ వేదికగా మంగళవారం(అక్టోబరు 11) బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం ఆటంకం కలిగించింది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉండటంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
సెమీస్‌లో థాయ్‌లాండ్
దీంతో బంగ్లా, యూఏఈ జట్లకు భంగపాటు ఎదురైంది. చెరో పాయింట్ లభించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 5 పాయింట్లు మాత్రమే సాధించిన బంగ్లా గ్రూప్ దశలో ఐదో స్థానంలో నిలిచిపోయింది. మరోవైపు.. పాకిస్తాన్‌పై సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన థాయ్‌లాండ్ ఆరు పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధించింది.
భారత్, పాకిస్తాన్, శ్రీలంకతో పాటు టాప్-4లో స్థానం దక్కించుకుంది. కాగా అక్టోబరు 13న సెమీ ఫైనల్స్ జరుగనుండగా.. 15న మహిళల ఆసియా కప్-2022 ఫైనల్ జరుగనుంది. ఇక ఈసారి మ్యాచ్‌లన్నీ సెల్హెట్‌లోని సెల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే జరగడం గమనార్హం.
చదవండి: T20 World Cup 2022: నెదర్లాండ్ జట్టు సలహాదారుడిగా టీమిండియా మాజీ కోచ్
Sreehari Nataraj: 'మెడల్స్ అక్కడే వదిలేసి రమ్మంటారా?'.. స్టార్ స్విమ్మర్‌కు అవమానం
After a hard fought battle, India 🇮🇳, Pakistan 🇵🇰, Sri Lanka 🇱🇰 and Thailand 🇹🇭 qualify for the semi-finals of the #WomensAsiaCup2022 🏆!
— AsianCricketCouncil (@ACCMedia1) October 11, 2022
We have some exciting games lined up ahead! Who are you rooting for? 👇#AsianCricketCouncil #ACC pic.twitter.com/QWUUd4z8l9
Comments
Please login to add a commentAdd a comment