మహిళల ఆసియాకప్-2022లో భారత్ నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సెల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితమైంది.
బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నిగార్ సుల్తానా 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక భారత బౌలర్లలో దీప్తి శర్మ, షఫాలీ వర్మ చెరో రెండు వికెట్లు, రేణుకా సింగ్, రాణా తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు షఫాలీ వర్మ(55), స్మృతి మంధాన(47) చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది.
బంగ్లా బౌలర్లలో రుమనా ఆహ్మద్ మూడు వికెట్లు సాధించగా.. సల్మా ఖాటన్ ఒక్క వికెట్ పడగొట్టింది. కాగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 4 విజయాలతో భారత్ పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్10న థాయ్‌లాండ్‌తో తలపడనుంది.
చదవండి: Women's Asia Cup 2022:33 పరుగులకే ఆలౌట్.. మలేషియాపై శ్రీలంక ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment