ICC Player Of The Month Winners: రికార్డుల రారాజు, టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి మరో ఘనత అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న ఈ స్టార్ బ్యాటర్.. అక్టోబరు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు.
ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి సోమవారం వెల్లడించింది. పురుషుల క్రికెట్ విభాగంలో డేవిడ్ మిల్లర్, సికందర్ రజాలను వెనక్కి నెట్టి అత్యధిక ఓట్లతో కోహ్లి విజేతగా నిలిచినట్లు తెలిపింది.
పాక్ ఆల్‌రౌండర్ నిదా
ఇక మహిళల విభాగంలో వెటరన్ ఆల్‌రౌండర్ నిదా దర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకుంది. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్-2022లో కోహ్లి హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అక్టోబరు నెల ముగిసే సరికి 205 పరుగులతో నిలిచాడు కోహ్లి. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లలో అద్భుత అర్ధ శతకాలతో మెరిశాడు. ఇక మహిళల ఆసియా కప్-2022 టోర్నీలో రాణించిన నిదా దర్ అక్టోబరు నెలలో 145 పరుగులు సాధించడం సహా ఎనిమిది వికెట్లు పడగొట్టి సత్తా చాటింది.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు- అక్టోబరు 2022
విరాట్ కోహ్లి- ఇండియా
నిదా దర్- పాకిస్తాన్
చదవండి: ఆసీస్‌కు అవమానం! టాప్ రన్ స్కోరర్లు, అత్యధిక వికెట్ల వీరులు! కోహ్లి తర్వాత సూర్య మాత్రం కాదు!
WC 2022: ఒక్క క్యాచ్‌తో తారుమారు: సౌతాఫ్రికాలో పుట్టి ఆ జట్టునే దెబ్బకొట్టిన ప్లేయర్లు.. జట్టులో తెలుగు కుర్రాడు కూడా!
Comments
Please login to add a commentAdd a comment