CM Jagan Congratulate To India Women Team For Winning Asia Cup Title - Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌ గెలిచిన భారత మహిళా జట్టుకు సీఎం జగన్‌ అభినందనలు

Published Sat, Oct 15 2022 5:23 PM | Last Updated on Sat, Oct 15 2022 6:14 PM

CM Jagan Congratulate To India Women Team For Winning Asia Cup Title - Sakshi

సాక్షి, అమరావతి: మహిళల ఆసియా కప్‌-2022 గెలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో విజయ పరంపర కొనసాగించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

కాగా మహిళ ఆసియా కప్‌ విజేతగా భారత్‌ అవతరించిన విషయం తెలిసిందే. ఏడోసారి ఆసియా కప్‌ గెలిచిన జట్టుగా భారత్‌ రికార్డ్‌ సృష్టించింది. శనివారం జరిగిన కీలకమైన ఫైనల్‌లో 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది.

66 పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్‌కు దిగిన భారత్‌ 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజేతగా నిలిచింది. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ స్మృతి మంధాన హాఫ్‌ సెంచరీతో(25 బంతుల్లో 51 పరుగులు) రాణించింది. నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చిన రేణుకా సింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement