రాజ్‌కోట్ వేదికగా భారత మహిళల జట్టు తొలి వన్డేలో ఐర్లాండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. హర్మాన్ ప్రీత్ కౌర్ గైర్హజరీలో స్మతి స్మృతి మంధాన భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌తో ముంబైకి చెందిన ఆల్‌రౌండర్ సయాలీ సత్‌ఘరే గణేష్ భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కెప్టెన్ స్మతి స్మృతి మంధాన చేతుల మీదగా ఆమె ఇండియా క్యాప్‌ను అందుకుంది. ఈ క్రమంలో నెటిజన్లు ఎవరీ సయాలీ అని వెతుకుతున్నారు.
ఎవరీ సయోలీ?
24 ఏళ్ల సయోలీ సత్‌ఘరే దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2015లో అరంగేట్రం చేసిన ఆమె.. అప్పటినుంచి నిలకడగా రాణిస్తోంది. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2024తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. గతేడాది డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్‌కు ఆమె ప్రాతినిథ్యం వహించింది. ఆ సీజన్‌లో తొలుత ఆమె చాలా మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైంది.
కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం సయోలీకి సువర్ణ అవకాశం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డి హేమలతకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆమె బరిలోకి దిగింది. ఆ మ్యాచ్‌లో ఆమె పర్వాలేదన్పించింది. దీంతో డబ్ల్యూపీఎల్-2025 సీజన్‌కు ముందు గుజరాత్ ఆమెను రూ.10 లక్షలకు రిటైన్ చేసుకుంది. సయోలీ సత్‌ఘరే అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది.
దేశీవాళీ క్రికెట్‌లో అదుర్స్..
లిస్ట్-ఎ క్రికెట్‌లో ఇప్పటివరకు 51 మ్యాచ్‌లు ఆడిన సయోలీ.. 20.81 సగటుతో 666 పరుగులు, 56 వికెట్లు పడగొట్టింది. 2023–24 సీనియర్ మహిళల వన్డే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై ఆమె ఆజేయ సెంచరీతో మెరిసింది. బౌలింగ్‌లో 7/5 స్పెల్ అత్యుత్తమ గణాంకాలుగా ఉన్నాయి.
తుది జట్లు
భారత మహిళల జట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, తేజల్ హసబ్నిస్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, సయాలీ సత్‌ఘరే, సైమా ఠాకోర్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు
ఐర్లాండ్ మహిళల జట్టు: సారా ఫోర్బ్స్, గాబీ లూయిస్(కెప్టెన్), ఉనా రేమండ్-హోయ్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, లారా డెలానీ, లేహ్ పాల్, కౌల్టర్ రీల్లీ(వికెట్ కీపర్), అర్లీన్ కెల్లీ, జార్జినా డెంప్సే, ఫ్రెయా సార్జెంట్, ఐమీ మాగైర్
Comments
Please login to add a commentAdd a comment