![Bangladesh Reports First Omicron cases - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/11/Untitled-6.jpg.webp?itok=GXp-FXxQ)
ఢాకా: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఇటీవలే జింబాబ్వే పర్యటన నుంచి తిరిగివచ్చిన ఇద్దరు మహిళా క్రికెటర్లు ఒమిక్రాన్ బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆ దేశ వైద్య మంత్రి జహీద్ మలాకీ శనివారం ప్రకటించారు. కోవిడ్ బారిన పడిన ఆ ఇద్దరు క్రికెటర్లలో స్వల్ప జ్వరం మినహా ఎటువంటి లక్షణాలు లేవని, నిబంధనల ప్రకారం వారిని క్వారంటైన్‌కు తరలించామని ఆయన తెలిపాడు.
అలాగే బాధితులతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరికీ కోవిడ్ పరీక్షలు చేసామని, వారందరికీ నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌లో ఇవే తొలి ఒమిక్రాన్ కేసులని ఆయన నిర్ధారించారు. కాగా, గత నెలలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలలో కోవిడ్ కొత్త వేరియంట్(ఒమిక్రాన్) కేసులు వెలుగు చూడడంతో ప్రపంచం మొత్తం మరోసారి అప్రమత్తంగా ఉన్న విషయం తెలిసిందే.
చదవండి: Ashes 1st Test: ఆసీస్ చేతిలో భంగపడ్డ రూట్ సేనకు మరో భారీ షాక్..
Comments
Please login to add a commentAdd a comment