purinima rao
-
HCA: మహిళా క్రికెట్ హెడ్‌కోచ్‌పై వేటు
మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అతడిని సస్పెండ్ చేస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. కాగా విజయవాడలో మ్యాచ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న క్రమంలో జై సింహా మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్‌లో వారి ముందే మద్యం సేవిస్తూ.. అడ్డు చెప్పినందుకు బూతులు తిట్టాడు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లు కోచ్ వ్యవహారశైలిపై హెచ్‌సీఏకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. జై సింహాతో పాటు అతడికి సహకరించారంటూ సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమారావుపై కూడా కంప్లైంట్ చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో హెచ్‌సీఏ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా.. కోచ్ పదవి నుంచి జై సింహాను తక్షణమే తప్పిస్తూ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిర్ణయం తీసుకున్నారు. ‘‘మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు. క్రిమినల్ కేసులు పెడతాం. పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతాం’’ అని జై సింహా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. మహిళా క్రికెటర్లకు హెచ్‌సీఏ ఎల్లపుడూ అండగా ఉంటుందని జగన్మోహన్ రావు భరోసా ఇచ్చారు. విచారణ ముగిసే వరకు జై సింహాను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై -
యువ ఆటగాళ్లకు సరైన వేదిక
♦ ‘మొయినుద్దౌలా’పై లక్ష్మణ్ ♦ టోర్నీ ట్రోఫీ ఆవిష్కరణ ఉప్పల్ : కెరీర్లో ఎదిగేందుకు శ్రమిస్తున్న యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మొయినుద్దౌలా గోల్డ్ కప్ మంచి వేదిక అని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆడిన తనకూ ఎన్నో గుర్తుండిపోయే మంచి అనుభవాలు ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. నేటినుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో మంగళవారం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చరిత్రాత్మక టోర్నీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్న హెచ్‌సీఏను ఆయన అభినందించారు. గతంలోకంటే మొయినుద్దౌలాను మరింత బాగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ వెల్లడించారు. ఐఏఎస్ అధికారి జయే ష్ రంజన్‌తో పాటు హెచ్‌సీఏ సభ్యులు దీనికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత మహి ళా క్రికెట్ జట్టు కోచ్ పూర్ణిమారావును ఘనంగా సత్కరించారు. ఈ నెల 16 వరకు జరిగే గోల్డ్‌కప్ లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. వీవీఎస్‌నూ ఆపేశారు... ట్రోఫీ ఆరంభోత్సవానికి స్టేడియం చేరిన లక్ష్మణ్‌కు గేటు వద్ద ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. వీవీఎస్‌ను గుర్తించని సెక్యూరిటీ సిబ్బంది కారుతో సహా ఆయనను లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు. దాంతో విసుగెత్తిన ఈ మాజీ క్రికెటర్ హెచ్‌సీఏ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. దాంతో వారు బయటికి వచ్చి క్షమాపణలు చెప్పి లక్ష్మణ్‌ను సాదరంగా లోపలికి తీసుకెళ్లారు.