యువ ఆటగాళ్లకు సరైన వేదిక | Is the place to young players | Sakshi
Sakshi News home page

యువ ఆటగాళ్లకు సరైన వేదిక

Published Wed, Sep 2 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

Is the place to young players

♦ ‘మొయినుద్దౌలా’పై లక్ష్మణ్
♦ టోర్నీ ట్రోఫీ ఆవిష్కరణ
 
 ఉప్పల్ : కెరీర్‌లో ఎదిగేందుకు శ్రమిస్తున్న యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మొయినుద్దౌలా గోల్డ్ కప్ మంచి వేదిక అని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆడిన తనకూ ఎన్నో గుర్తుండిపోయే మంచి అనుభవాలు ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. నేటినుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో మంగళవారం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చరిత్రాత్మక టోర్నీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్న హెచ్‌సీఏను ఆయన అభినందించారు.

గతంలోకంటే మొయినుద్దౌలాను మరింత బాగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ వెల్లడించారు. ఐఏఎస్ అధికారి జయే ష్ రంజన్‌తో పాటు హెచ్‌సీఏ సభ్యులు దీనికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత మహి ళా క్రికెట్ జట్టు కోచ్ పూర్ణిమారావును ఘనంగా సత్కరించారు. ఈ నెల 16 వరకు జరిగే గోల్డ్‌కప్ లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.

 వీవీఎస్‌నూ ఆపేశారు...
 ట్రోఫీ ఆరంభోత్సవానికి స్టేడియం చేరిన లక్ష్మణ్‌కు గేటు వద్ద ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. వీవీఎస్‌ను గుర్తించని సెక్యూరిటీ సిబ్బంది కారుతో సహా ఆయనను లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు. దాంతో విసుగెత్తిన ఈ మాజీ క్రికెటర్ హెచ్‌సీఏ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. దాంతో వారు బయటికి వచ్చి క్షమాపణలు చెప్పి లక్ష్మణ్‌ను సాదరంగా లోపలికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement