సౌతాఫ్రికాతో జరుగబోయే నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుండగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సౌతాఫ్రికా సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్‌లు క్లాష్ కానున్న నేపథ్యంలో టీమిండియాకు ఇద్దరు హెడ్ కోచ్‌లు అవసరమయ్యారు. తొలుత టీమిండియా షెడ్యూల్‌లో సౌతాఫ్రికా టీ20 సిరీస్ లేదు. ఈ మధ్యలో క్రికెట్ సౌతాఫ్రికా విన్నపం మేరకు బీసీసీఐ ఈ సిరీస్‌కు ఒప్పుకుంది.
సౌతాఫ్రికా టీ20 సిరీస్ నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో జరుగనుండగా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు నవంబర్ 10 లేదా 11 తేదీల్లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో లక్ష్మణ్ సపోర్టింగ్ స్టాఫ్‌గా ఎన్‌సీఏ సభ్యులు సాయిరాజ్ బహుతులే, హృషికేశ్ కనిత్కర్, సుబదీప్ ఘోష్ ఉండే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆసియా కప్ ఎమర్జింగ్ టోర్నీలో టీమిండియా కోచింగ్ సభ్యులుగా వ్యవహరించారు.
కాగా, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల భారత బృందాన్ని అక్టోబర్ 25న ప్రకటించారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. భారత టెస్ట్ జట్టులోకి సభ్యులెవరికీ ఈ జట్టులో చోటు దక్కలేదు. సౌతాఫ్రికా పర్యటన కోసం భారత జట్టు నవంబర్ 4న బయల్దేరి వెళ్లనుంది.
సౌతాఫ్రికా టీ20 సిరీస్ కోసం భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్ , యష్ దయాళ్
Comments
Please login to add a commentAdd a comment