ఆడమ్ గిల్‌క్రిస్ట్.. ప్రపంచ క్రికెట్‌ను ఏలిన గొప్ప వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడు. ఆస్ట్రేలియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తన ఆటతో, వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియాకు ఓంటి చేత్తో ఎన్నో విజయాలను అందించిన ఘనత అతడిది.
ఆసీస్ తరపున మూడు వన్డే వరల్డ్‌కప్ టైటిల్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. 2007 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై గిల్లీ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికి సగటు క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ ఆసీస్ లెజెండ్ ఆ మరుసటి ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరిని షాక్‌కు గురిచేశాడు.
2008లో భారత్‌తో జరిగిన అడిలైడ్ టెస్టు మధ్యలో తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. తన కెరీర్‌లో 100 టెస్టుల మైలు రాయిని అందుకోవడానికి కేవలం 4 మ్యాచ్‌ల దూరంలో ఉన్న సమయంలో గిల్లీ రిటైర్మెంట్ ప్రకటించడం అప్పటిలో తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే తాజాగా గిల్‌క్రిస్ట్ తన సడన్ రిటైర్మెంట్‌కు గల కారణాన్ని వెల్లడించాడు. భారత దిగ్గజ బ్యాటర్ వీవీయస్ లక్ష్మణ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను విడిచిపెట్టిన కారణంగానే తను రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు గిల్లీ తెలిపాడు. వెంటనే తన నిర్ణయాన్ని మరో ఆసీస్ లెజెండ్ మాథ్యూ హేడెన్‌కి చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో గిల్‌క్రిస్ట్ అన్నాడు.
"నేను చివరగా నా కెరీర్‌లో భారత్‌పై ఆడాను. ఆడిలైడ్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఓ ఫన్నీ సంఘటన జరిగింది.
బ్రెట్ లీ బౌలింగ్‌లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాను. కానీ బంతిని సరిగ్గా అందుకోలేకపోయాను. ఆ రోజు రాత్రి నా భార్యకు ఫోన్ చేసి మాట్లాడాను. మేము భారత్‌తో సిరీస్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్నాం. అందుకు సంబంధించిన విషయాలను ఆమెతో చర్చించాను.
విండీస్ పర్యటనలో మొత్తం మూడు మ్యాచ్‌లతో కలిపి నా 99వ టెస్టు మ్యాచ్ మార్క్‌ను అందుకోనున్నాను. ఆ తర్వాత మేము ఇండియా టూర్‌కు వెళ్లనున్నాం. భారత్‌లో నా 100వ టెస్టు ఆడతాను అని ఆమెతో చెప్పాను. 100 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా ప్లేయర్ల లిస్టులో చేరుతానని భావించాను. ఆ అరుదైన గౌరవం దక్కుతుందని నేను అనుకున్నాను. కానీ ఆ మరుసటి రోజు నా కథ మొత్తం మారిపోయింది.
ఆ తర్వాతి రోజు ఆటలో భారత బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన సునయాస క్యాచ్‌ను నేను జారవిడిచాను. లక్ష్మణ్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న వచ్చిన బంతి నా గ్లవ్స్‌లో పడి నేలకు తాకింది. దీంతో ఈజీ క్యాచ్‌ను అందుకోలేకపోయాను. ఎలా మిస్స్ అయ్యిందో అని బిగ్ స్క్రీన్ మీద రిప్లే చూశాను. పదే పదే అదే చూపించారు. ఏకంగా 32 సార్లు దాన్ని ప్లే చేస్తూనే వచ్చారు. ఇక చాలు, విడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను.
వెంటనే స్లిప్‌లో ఉన్న మాథ్యూ హేడెన్ వైపు చూస్తూ నా పని అయిపోయింది, నేను రిటైర్మెంట్ అవ్వాల్సిన సమయం అసన్నమైంది చెప్పాను. వెస్టిండీస్ పర్యటను గురించి ఆలోచించకండి, భారత్‌లో 100వ టెస్టు గురించి కూడా ఆలోచించవద్దు చెప్పా.
బంతి, నా గ్లవ్స్‌ని తాకి పిచ్‌పైన పడ్డప్పుడే రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని హెడన్‌తో అన్నాను. కానీ హెడన్ మాత్రం నేను అటువంటి సంచలన నిర్ణయం తీసుకోకుండా ఒప్పించే ప్రయత్నం చేశాడని క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. కాగ గిల్లీ ఆసీస్ తరపున 96 టెస్టుల్లో 47.6 సగటుతో 5570 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి.
చదవండి: 'టాటా, బై బై.. నీ పని అయిపోయింది'.. పాక్ హెడ్ కోచ్‌పై సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment