ఆసీస్ అయితే ముందుగా బ్యాటింగ్‌కు దిగేది: గిల్‌క్రిస్ట్
టాస్ గెలిచి కూడా ఫ్లాట్ ట్రాక్‌పై ఫీల్డింగ్‌కు దిగడంపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే చాంపియన్స్ ట్రోఫీలాంటి పెద్ద ఈవెంట్ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్‌కు దిగడమే ఉత్తమమని ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డారు. ‘నేను పెర్త్ నుంచి ఢిల్లీకి వచ్చే ముందు టాస్ వేయడం చూశాను. అయితే ఆసీస్ జట్టు కచ్చితంగా ఇలాంటి మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్‌కు దిగి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించేలా చేస్తుంది. కానీ ఈ టోర్నీలో ఎక్కువగా చేజింగ్ జట్లే విజయం సాధించాయి. అందుకే కోహ్లి నిర్ణయాన్ని కూడా పూర్తిగా తప్పుపట్టడానికి లేదు’ అని భారత్‌లో ఆసీస్ విద్యా రాయబారిగా ఉన్న గిల్‌క్రిస్ట్ అన్నారు.