
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తను నటించిన జై సింహా చిత్రం ఆడియోను అమరావతిలో విడుదల చేయడం సంతోషంగా ఉందని సినీ నటుడు, ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ అన్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల ఆదివారం విజయవాడలో జరిగింది.
మంత్రి నారా లోకేశ్ ఈ చిత్రం పాటల సీడీని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జీవితచరిత్రను సినిమాగా తీస్తున్నామని బాలకృష్ణ చెప్పారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఇప్పుడు పేర్లు మారుస్తున్నారన్నారు. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయనున్నట్లు నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. కార్యక్రమంలో చిత్ర కథానాయికలు హరిప్రియ, నటాషా, మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్, నటులు చలపతిరావు, శివాజీరాజా, ఎల్‌బి.శ్రీరామ్, ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.