![Balakrishnas jai simha trailer released - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/25/balakrishna_1.jpg.webp?itok=wzjZFh18)
సాక్షి, హైదరాబాద్: నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ ట్రైలర్ ఆదివారం విడుదలైంది. ఫుల్ మాస్ యాక్షన్ తో బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించారు. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొంత సమయానికి 2 మిలియన్ల వ్యూస్, 30 వేల లైక్స్ తో జై సింహా ట్రైలర్ దూసుకుపోతోంది.
'సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్ గా ఉందని కెలికితే తల కొరికేస్తదంటూ' బాలకృష్ణ టీజర్‌లో చెప్పిన మాస్ డైలాగ్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకోగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో ‘సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి.. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి’, బొమ్మ తిరగేస్తా నీ..! అనే ఎం.రత్నం పవర్‌ఫుల్ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌లో హీరోయిన్ నయనతార అందంగా కనిపించింది. 'నీకు వయసు ఆగిపోతుందేమో, కానీ నాకు వయసు అయిపోతోంది' అని చెప్పిన డైలాగ్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.
తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య సరసన నయనతార, నాటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి.!
Comments
Please login to add a commentAdd a comment