టాలీవుడ్‌లో కలకలం రేపిన ఐటీ దాడులు | IT Raids on Jai Simha and Agnyaathavaasi Producers | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో కలకలం రేపిన ఐటీ దాడులు

Published Wed, Jan 17 2018 4:51 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

తెలుగు సినిమా నిర్మాతల ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు చేసింది. భారీ లాభాలు సాధిస్తున్న పలు నిర్మాణ సంస్థలు టీడీఎస్ సక్రమంగా కట్టడం లేదని గుర్తించిన ఐటీ అధికారుల వారి ఇళ్లు, ఆఫీసులలో సోదాలు నిర్వహించారు. ఇటీవల జై సింహా సినిమాను నిర్మించిన సి.కళ్యాణ్ , అజ్ఞాతవాసి సినిమాను నిర్మించిన హారికా హాసిని క్రియేషన్స్ ఆఫీసులతో పాటు సురేష్‌ ప్రొడక్షన్స్‌, భవ్య క్రియేషన్స్‌, డీవీవీ క్రియేషన్స్, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్‌ లాంటి ఎనిమిది నిర్మాణ సంస్థల ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. వీరిలో మూడేళ్లుగా టీడీఎస్‌ కట్టకుండా ఉన్న కొం‍త మంది నిర్మాతలకు ఐటీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement