16 ఏళ్ల తరువాత అదే కాంబినేషన్‌లో.. | Balakrishna Will Join Hands With VV Vinayak | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 23 2018 12:35 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Balakrishna Will Join Hands With VV Vinayak - Sakshi

కుర్ర హీరోలకు పోటి ఇచ్చేలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ మరో సినిమాకు అంగీకరించారు. ఇటీవల జై సింహా సినిమాతో ఆకట్టుకున్న బాలకృష్ణ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ (ఎన్టీఆర్ బయోపిక్‌) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే తాజా మరో సినిమాను ఫైనల్‌ చేశారు బాలకృష్ణ.

జై సింహా సినిమాను నిర్మించిన సీ కల్యాణ్ బ్యానర్‌లో మరో సినిమాను చేయనున్నాడు బాలయ్య. ఈ సినిమాను మాస్ యాక్షన్‌ సినిమాల స్పెషలిస్ట్‌ వీవీ వినాయక్‌ డైరెక్ట్‌ చేయనున్నారు. 2002లో వినాయక్‌ దర్శకత్వంలో చెన్నకేశవ రెడ్డి సినిమాలో నటించారు బాలయ్య, 16 ఏళ్ల తరువాత మరోసారి అదే కాంబినేషన్‌ రిపీట్ కానుంది. ఈ సినిమాను మేలో ప్రారంభించి 2019 సంక్రాంతికి రిలీజ్ చేసేలాప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా కన్నడ సూపర్‌ హిట్ మఫ్టీ కి రీమేక్‌ అన్న ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement