
సంక్రాంతి బరిలో జై సింహాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ, తరువాత ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలసిందే. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ దర్శకత్వంలో బాలయ్యే స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎంతో రిసెర్చ్ చేసిన తరువాత ఎన్టీఆర్ బయోపిక్ ను ప్రారంభిస్తున్నామని గతంలోనే ప్రకటించాడు నందమూరి హీరో.
ఈ సినిమా టీజర్ ను ఎన్టీఆర్ వర్థంతి సందర‍్భంగా జనవరి 18న రిలీజ్ చేయాలని భావించారు. టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ కూడా చేశారు. తాజాగా టీజర్ రిలీజ్ ను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. టీజర్ రిలీజ్ ఎప్పుడున్న విషయాన్ని త్వరలోనే బాలకృష్ణ స్వయంగా ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment