
సాక్షి, హైదరాబాద్: నందమూరి బాలకృష్ణకు మాస్ అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. ఆయన సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు అభిమానులకు తెగ నచ్చేస్తాయి. అలాంటిదే తాజాగా ఆయన నటించిన తాజా చిత్రం ‘జై సింహా’. లోను ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ బొలెరో కారును ఒంటి చేత్తో పైకెత్తే సన్నివేశం ఉంటుంది.
ఈ సన్నివేశానికి చెందిన వీడియోని విష్ణు చైతన్య అనే నెటిజన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు ట్విటర్‌లో ట్యాగ్ చేశారు. ‘మహీంద్ర సర్..ఇలాంటిది మీ కలెక్షన్లలో ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో బొలెరో ట్రెండింగ్ అవుతోంది.. మీరు చూడండి’ అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్‌కు స్పందించిన ఆనంద్ మహీంద్ర రిప్లై ఇచ్చారు. బొలెరో కార్లను చెక్ చేయడానికి సర్వీస్ వర్క్‌షాపుల్లో హైడ్రాలిక్ లిప్ట్‌లు ఉపయోగించాల్సిన అవసరం లేదంటూ సరదాగా బదులిచ్చారు.
Haha. Now all our service workshops won’t need any hydraulic lifts anymore to do Bolero check-ups!! https://t.co/WiS6hcpT2h
— anand mahindra (@anandmahindra) January 16, 2018