కిచెన్‌ సామానుతో సైకిల్‌.. వావ్ ఏం క్రియేటివిటీ గురూ! | Anand mahindra hi tech talicycle twitter post viral | Sakshi
Sakshi News home page

Anand Mahindra: ఇది హై-టెక్ తాలిసైకిల్ గురూ.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్!

Published Sun, Jul 30 2023 1:38 PM | Last Updated on Sun, Jul 30 2023 2:40 PM

Anand mahindra hi tech talicycle twitter post viral - Sakshi

Anand Mahindra Tweet: ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టాలెంట్ ఎవరి సొత్తు కాదని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. మనదేశంలో సృజనాత్మకతకు కొదువ లేదని గతంలో కొన్ని సంఘటనల ద్వారా వెలువడింది. ఇది మరో సారి ఋజువైంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫొటోలో కేవలం వంట గదిలో ఉపయోగించే వస్తువులతో ఒక టూవీలర్ నిర్మించారు.

ఇదీ చదవండి: ఆగష్టులో విడుదలయ్యే కొత్త కార్లు - పంచ్ సీఎన్‌జీ నుంచి వోల్వో సీ40 రీఛార్జ్ వరకు..

ఇది అడ్వాన్స్డ్ 'హై-టెక్ తాలిసైకిల్' అంటూ ఆయన తన ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇప్పటికే ఈ పోస్ట్ వేలమంది వీక్షించారు. లెక్కకు మించి లైక్స్ చేశారు. కొంతమంది దీన్ని సిల్వర్ బుల్లెట్ అంటూ.. చాలా అద్భుతంగా ఉందంటూ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: హీరోలా ఉన్న ఇతడిని గుర్తుపట్టారా? దేశం గర్వించదగ్గ సంపన్నుడు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement