'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం'.. అందమైన ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే అవయవం 'కళ్ళు'. కళ్ళు లేకపోతే బతికున్నా నరకం చూసినట్టే అవుతుంది. అలాంటి వాటికి టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఓ శుభవార్త చెప్పారు. కళ్ళు లేనివారికి కంటి చూపు తెప్పించే ఓ గ్యాడ్జెట్ తయారు చేయడానికి న్యూరాలింక్ సిద్ధమైందని వెల్లడించారు.
బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ చేస్తున్న ప్రయోగాలు విజయవంతమైతే.. అంధులు కూడా ఈ లోకాన్ని చూడగలరు. ఇలాంటి గొప్ప ప్రయోగానికి శ్రీకారం చుట్టిన మస్క్‌ను.. భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అంధుల కోసం రూపొందిస్తున్న పరికరం అంచనాలను అనుగుణంగా ఉంటే.. మానవాళికి మీరిచ్చే గొప్ప గిఫ్ట్ ఇదే అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో మస్క్‌ను కొనియాడారు. ఎంతోమంది ప్రజలు కూడా మస్క్ చేస్తున్న ఈ ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు.
ఇదీ చదవండి: 'అలాంటివేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రా
న్యూరాలింక్ రూపొందిస్తున్న బ్లైండ్‌సైట్ పరికరం కళ్ళు లేదా ఆప్టిక్ నరాలను కోల్పోయిన వారికి కూడా చూడటానికి వీలు కల్పిస్తుంది. విజువల్ కార్టెక్స్ చెక్కుచెదరకుండా ఉంటే, పుట్టుకతో అంధత్వం ఉన్నవారు కూడా లోకాన్ని చూడగలరని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇదెలా పని చేస్తుంది? చూపు లేని వారు లోకాన్ని ఎలా చూడగలరు అనే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
If this device lives up to these expectations then, much more than Tesla or Space X, THIS will be your most enduring gift to humankind. https://t.co/BtnbEEIvyn
— anand mahindra (@anandmahindra) September 19, 2024
Comments
Please login to add a commentAdd a comment