
మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని వింటూ ఉంటాం. అయితే అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు. కానీ మనం చూసిన వారిలో కొన్ని పోలికలు సరిపోయినా అచ్చు ఫలనా వారిలాగే ఉన్నారని అంటూ ఉంటాం.
తాజాగా దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను పోలిన వ్యక్తిని గుర్తించినట్లు ఆయనను ట్యాగ్‌చేస్తూ ఒక వ్యక్తి ఎక్స్ ఖాతా ద్వారా ఓ ఫొటో షేర్ చేశారు. ‘మీరు కూడా ఈ ఫొటో చూసిన తర్వాత షాక్‌కు గురవుతారు’అని ఆనంద్‌మహీంద్రాను ట్యాగ్‌చేశారు. దానికి స్పందించిన ఆయన ‘మేము చిన్నప్పుడే ఏదో మేళాలో విడిపోయాం అనిపిస్తుంది’అని సరదాగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వారి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Looks like we were separated during some Mela in our childhood…😃 https://t.co/j8j7B8ooAo
— anand mahindra (@anandmahindra) November 14, 2023