మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్ర నిత్యం వ్యాపార వ్యవహారాలలో తలమునకలవుతుంటారు. దీని వల్ల బోర్‌గా ఫీలవ్వకుండా యాక్టీవ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకే సమకాలిన అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. యువ వ్యాపరవేత్తలు..ఆయా రంగాల్లో రాణించేలా మోటివేట్ చేస్తుంటారు. అదే సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి క్షణం ఆలస్యం చేయకుండా సాయం చేస్తుంటారు. అలాంటి ఆనంద్ మహీంద్రాకు నెటిజన్ నుంచి తలతిక్క ప్రశ్న ఎదురైంది. దానికి బిజినెస్ టైకూన్ దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు.
ఓ నెటిజన్ ఆనంద్ మహీంద్రాను మీరు ఏ మతానికి చెందిన వారు' అంటూ ట్వీట్ చేశారు."అంతేకాదు అడగడం తెలివి తక్కువ ప్రశ్న అని నాకు తెలుసు. అయితే నన్ను తెలివి తక్కువవాడిగానే ఉండనివ్వండి. ఆప్ పంజాబీ హై సర్? (మీరు పంజాబీనా,సర్?)" అని అడిగాడు.
Not a stupid question but my straight answer is that I’m an Indian.. https://t.co/MrrmP9cGuE
— anand mahindra (@anandmahindra) January 8, 2022
అందుకు ఆనంద్ మహీంద్రా ఇలా..ఇది అతి తెలివి తక్కువ ప్రశ్నకాదు. కానీ నా సూటి సమాధానం నేను భారతీయుడిని అంటూ రిప్లయి ఇచ్చారు. ఆ రిప్లయిపై నెటిజన్లు ఆనంద్ మహీంద్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి క్లిష్టసమయాల్లో సమయస్పూర్తిని ప్రదర్శించడం ఆయనే చెల్లిందంటూ రీ ట్వీట్‌లు చేస్తున్నారు.
చదవండి: ఫుట్‌పాత్‌పై బిచ్చగాడి డ్యాన్స్.. ఆనంద్ మహీంద్రా ఫిదా.. వెంటనే గొప్ప అవకాశం
Comments
Please login to add a commentAdd a comment