ఆనంద్‌ మహీంద్రను దాటేసి మరీ టాప్‌లోకి రతన్‌ టాటా  | Hurun India Rich List 2023: Ratan Tata Surpasses Anand Mahindra On X Followers With 12.6 Million Followers - Sakshi
Sakshi News home page

ఆనంద్‌ మహీంద్రను దాటేసి మరీ టాప్‌లోకి రతన్‌ టాటా 

Published Tue, Oct 10 2023 3:13 PM | Last Updated on Tue, Oct 10 2023 3:47 PM

RatanTata surpasses Anand Mahindra on X followers Hurun India Rich List 2023 - Sakshi

పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. వ్యాపార దక్షతతో మాత్రమే  కాదు, తనదైన వ్యక్తిత్వం, దాతృత్వంతో ఆయన ప్రత్యేకతే వేరు.  అందుకే సోషల్‌ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్‌ మామూలుది కాదు. ఇదే విషయాన్నిమరోసారి నిరూపించుకున్నారు రతన్‌ టాటా.  మహీంద్ర అండ్‌ మహీంద్ర అధినేత ఆనంద్‌ మహీంద్రను అధిగమించి మరీ నెటిజన్లు అభిమానాన్ని దోచుకున్నారు.  భారతీయ సోషల్ మీడియాలో 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023  జాబితాలో టాప్‌లో ప్లేస్‌ కొట్టేశారు  

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో ఎక్స్‌( ట్విటర్) ఎక్కువ మంది ఫాలోవర్లతో వార్తల్లో నిలిచారు. 12.6 మిలియన్లతో భారతీయ సోషల్ మీడియాలో అత్యంత విస్తృతంగా అనుసరించే వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారు. ఒక ఏడాదిలో  ఆయన ఫాలోవర్లు సంఖ్య 8 లక్షలకు పైగా పెరిగారు.  ఆ తరువాతి స్థానంలో  10.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఆనంద్ మహీంద్రా నిలిచారు. ( కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక)

ఈ జాబితాలో టాప్‌ టెన్‌లో పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, గూగుల్‌ అల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌,  మైక్రోసాఫ్ట్‌ కో-ఫౌండర్‌ సత్య నాదెళ్ల,  వ్యాపార వేత్తలు నందన్‌ నీలేకని, రోణీ  స్క్రూవాలా,  హర్ష వర్థన్‌ గోయింగా, కిరణ్‌ మజుందార్‌ షా, ఉదయకోటక్‌ నిలిచారు.

దీంతో పాటు, భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల  12వ వార్షిక  లిస్ట్‌ను  కూడా  హురున్‌ వెల్లడించింది. వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా సంపదలో గణనీయమైన క్షీణతను ఎదుర్కొన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని అధిగమించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ టాప్‌లోకి దూసుకొచ్చారు.  గౌతమ్ అదానీ సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నారు. అంబానీ సంపద ఈ కాలంలో భారీగా పుంజుకుని  దాదాపు రూ.8,08,700 కోట్లకు చేరింది.  గౌతమ్ అదానీ రూ.474,800 కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు.  సీరం  ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావల్లా  రూ. 2,78,500 కోట్ల మొత్తం సంపదతో మూడో స్థానంలోఉన్నారు.ఈ జాబితాలో రూ.2,28,900 కోట్ల సంపదతో శివ నాడార్ నాల్గవ స్థానంలో ఉన్నారు, గోపీచంద్ హిందూజా , అతని కుటుంబం రూ.1,76,500 కోట్లతో 5వ స్థానంలో ఉన్నారు. 1,64,300 కోట్ల సంపదతో దిలీప్ షాంఘ్వీ ఆరో స్థానంలో ఉన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement