వైజాగ్‌ చుట్టొచ్చిన సింహం | Jai Simha Vizag schedule completed | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ చుట్టొచ్చిన సింహం

Published Sun, Nov 12 2017 12:23 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Jai Simha Vizag schedule completed  - Sakshi

బాలకృష్ణ నటిస్తోన్న 102వ చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. నయనతార, నటాషా జోషీ, హరిప్రియ కథానాయికలు. ఈ చిత్రం వైజాగ్‌లో భారీ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. వైజాగ్‌ బీచ్‌ రోడ్‌లో ఐదువేల మంది జూనియర్‌ ఆర్టిస్టులు, 110 బస్సులతో ‘మహా ధర్నా’ సీక్వెన్స్‌ తీశాం.  బాలకృష్ణ– హరిప్రియలపై రొమాంటిక్‌ సాంగ్‌తోపాటు, బాలయ్య–నయనతారపై ఓ మాంటేజ్‌ పాటను చిత్రీకరించాం. టైటిల్‌కి, ఇటీవల విడుదల చేసిన బాలయ్య ఫస్ట్‌ లుక్‌కి విశేషమైన స్పందన వస్తోంది. ఇప్పటివరకూ బాలయ్య కెరీర్‌లో ‘సింహా‘  టైటిల్స్‌తో వచ్చిన సినిమాలన్నీ హిట్‌. ‘జై సింహా‘ కూడా సూపర్‌ హిట్‌ అవడం ఖాయం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్‌ భట్, సహ నిర్మాత: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: వరుణ్‌–తేజ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement