సూపర్‌ హిట్‌ రీమేక్‌లో బాలయ్య..? | Balakrishna Plans To Do A Kannada Remake | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 21 2018 10:38 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Balakrishna Plans To Do A Kannada Remake - Sakshi

నందమూరి బాలకృష్ణ

సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల జై సింహా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఇలా వరుస సినిమాలో బిజీగా ఉన్న బాలయ్య ఓ సూపర్‌ హిట్‌ సినిమాను రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారట.

కన్నడలో శివరాజ్‌ కుమార్‌, శ్రీ మురళి, శాన్వీలు ప్రధాన పాత్రల్లో నార్తన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మఫ్టీ. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కి ఘనవిజయం సాధించిన ఈ సినిమాను బాలకృష్ణ హీరోగా రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య మఫ్టీ రీమేక్‌కు అంగీకరిస్తాడా లేదా చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement